REVANTH REDDY: కాంగ్రెస్ శ్రేణులపై పోలీసుల దాడి దురదృష్టకరమని.. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు టీపీసీసీ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల వైఖరికి నిరసనగా రేపు జిల్లా కేంద్రాల్లోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఆందోళనలకు ఆయన పిలుపునిచ్చారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులపై పోలీసులు విచక్షణారహితంగా దాడికి పాల్పడడం శోచనీయమన్నారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను ఈడీ విచారణ నిమిత్తం వేధింపులకు గురిచేయడం సరికాదని హితవు పలికారు.
కాంగ్రెస్ కార్యకర్తలపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. శాంతియుత నిరసన చేస్తున్న తమపై దాడి చేయించారు. కాంగ్రెస్ శ్రేణులపై అక్రమకేసులను వెంటనే ఎత్తివేయాలి. రాహుల్, సోనియాను విచారణ పేరుతో హింసిస్తున్నారు. ఎస్‌ఐ కాలర్ పట్టుకున్నారని అక్రమంగా కేసులు పెట్టడం బాధాకరం. కేసీఆర్, మోదీ ఒకే డైరెక్షన్‌లో నడుస్తున్నారు. నిరసనల్లో పాల్గొన్న జాతీయ నేతలను కూడా వేధిస్తున్నారు. - రేవంత్ రెడ్డి, టీపీసీసీ ఛీఫ్
అక్రమ కేసులు బనాయిస్తూ ప్రజాస్వామ్యయుతంగా చేస్తున్న నిరసనను పోలీసులు దాడి చేసి ఉద్రిక్తంగా మార్చారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రేణుకా చౌదరి నిరసన చేస్తున్న క్రమంలో కింద పడి పోతూ ఉండగా ఎస్సై నీ పట్టుకుంటే దాన్ని దాడిగా చిత్రీకరిస్తూ, అక్రమంగా కేసులు పెట్టడం బాధాకరమన్నారు. ఈ రోజు కాంగ్రెస్ నేతలపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ మోదీ డైరెక్షన్‌లో నడుస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. పోలీసులు, ప్రభుత్వం తమ తీరు మార్చుకోవాలని లేనిపక్షంలో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.
ఇవీ చదవండి: