Revanth reddy on CM kcr: కేసీఆర్ మాటలు నమ్మి వరి సాగు చేయని రైతులు తీవ్రంగా నష్టపోయారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. పంట చేతికి వచ్చాక మిల్లర్లు, దళార్లకు తక్కువ ధరకే అమ్ముకుని మరింత మునిగిపోయారని మండిపడ్డారు. వరి వేస్తే ఉరేనని చెప్పిన కేసీఆర్.. సాగు చేయొద్దని చెప్పి రైతులను నిండా ముంచారని మండిపడ్డారు. వరి వేయొద్దని రైతులను బెదిరించిన కలెక్టర్‌ను ఎమ్మెల్సీగా చేసిన ఘనత మన ముఖ్యమంత్రిదేనని ఎద్దేవా చేశారు.
'కాంగ్రెస్ పోరాటంతోనే కేసీఆర్ కొనుగోలు కేంద్రాలు తెరిచారు. కొనుగోళ్లపై యుద్ధం ప్రకటించడానికి రాహుల్ గాంధీ వస్తున్నారని తెలిసి స్పందించారు. నరేంద్ర మోదీ, కేసీఆర్ మెడలు వంచి కొనుగోలు కేంద్రాలు తెరిపించాం. రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్నారని చెప్పిన తర్వాతే కేసీఆర్ కళ్లు తెరిచారు. పంట పండించకుండా 25 లక్షల ఎకరాల్లో రైతులు నష్టపోయిండ్రు. కేసీఆర్‌ను పూర్తిగా నమ్మిన రైతులు నిండా మునిగిండ్రు. సగం నమ్మినోడు సగం మునిగిండు. అసలు కేసీఆర్ మాటలు నమ్మనోడు మంచిగున్నడు.' - రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
వరి వేస్తే ఒక్కగింజ కూడా కొనేది లేదని కేసీఆర్ ఎన్నోసార్లు అన్నారని రేవంత్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా యాసంగిలో 55 లక్షల ఎకరాల్లో వరి సాగయ్యేదని రేవంత్‌రెడ్డి వెల్లడించారు. కేసీఆర్ మాటలు విని రైతులు 30 లక్షల ఎకరాల్లోనే సాగు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ మాటలు నమ్మిన రైతులు నిండా మునిగిపోయారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి మాటలు నమ్మని రైతులు మాత్రమే నష్టపోలేదన్నారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో 8 ఏళ్లుగా సీఎంఆర్ బియ్యం స్కాం సాగుతోంది: రేవంత్‌రెడ్డి
నడిరోడ్డుపై మహిళ వీరంగం.. స్కూటీని ఢీకొట్టాడని యువకుడిపై దాడి