రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ కుప్పకూలే పరిస్థితిలో ఉందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేల నుంచి సిఫార్సు లేఖలు ఉంటేనే ఎస్సై, సీఐలకు పోస్టింగులు ఇస్తున్నారని ఉత్తమ్ ఆరోపించారు. తెరాస నేతలు.. పోలీసులను ఉపయోగించుకొని వారితో తప్పుడు పనులు చేయిస్తున్నారని.. డీజీపీ మహేందర్‌రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు.
మంథని మాజీ ఉపసర్పంచ్, కాంగ్రెస్ నాయకుడు సతీశ్‌తో పాటు ఇతర నేతలు డీజీపీని కలిశారు. పుట్ట మధు నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని డీజీపీకి సతీశ్ విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: ఓబీసీలకు అన్యాయం చేస్తున్నారు: లక్ష్మణ్