కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగానే కరోనా కేసులు పెరుగుతున్నాయని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. కొవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేరుస్తామని గత ఏడాది సెప్టెంబరులో ముఖ్యమంత్రి చెప్పారని.. ఇంతవరకు ఆదిశగా చర్యలు తీసుకోలేదని ఉత్తమ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో 104, 108 సేవలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. ఆక్సిజన్ సదుపాయం ఉన్న బెడ్లు కావాలంటే రోజుకు యాభైవేలు నుంచి లక్ష వరకు ఖర్చుచేయాల్సిన వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
మెడికల్ హబ్‌గా ఉన్న హైదరాబాద్‌లో వెంటిలేటర్ సదుపాయం ఉన్న బెడ్లు లేక చాలా మంది మరణిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ లేక కొవిడ్ బాధితులు మరణిస్తే సర్కార్‌ది బాధ్యత కాదా.. అని ఉత్తమ్ ప్రశ్నించారు. వైద్యారోగ్య శాఖలపై సమీక్ష కోసం అధికారులే సీఎం ఫామ్‌హౌస్‌కు వెళ్లాలా అని నిలదీశారు.
పాత్రికేయులను కరోనా ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా గుర్తించాలని డిమాండ్ చేశారు. కరోనాతో మరణించిన మీడియా ప్రతినిధులకు పరిహారం చెల్లించాలని సూచించారు.
ఇవీచూడండి: భాగ్యనగరానికి భారీ సంఖ్యలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు