ETV Bharat / state

Revanth Interesting Comments: హరీశ్‌రావును ఇంటికి పంపేందుకు కేసీఆర్‌ ప్రణాళిక: రేవంత్‌

author img

By

Published : Oct 18, 2021, 6:17 PM IST

Updated : Oct 18, 2021, 7:44 PM IST

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి... ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావుపై ఆసక్తికర వ్యాఖ్యలు (Revanth Reddy Interesting Comments) చేశారు. త్వరలో సీఎం కేసీఆర్​ నాయకత్వంపై తిరుగుబాటు రాబోతోందని చెప్పారు. హరీశ్​ను ఇంటికి పంపే ప్లాన్ సిద్ధమైందని ఆరోపించారు. సీఎల్పీ కార్యాలయం వద్ద రేవంత్‌రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టి(Revanth Reddy Chitchat)గా మాట్లాడారు.

Revanth
రేవంత్ రెడ్డి

హుజూరాబాద్ ఎన్నికల (Huzurabad by elections) తర్వాత తెరాసలో చాలా మార్పులొస్తాయని... ఆ పార్టీలో తిరుగుబాటు తప్పదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు (Revanth Interesting Comments) చేశారు. సీఎల్పీలో ఆయన మీడియా ప్రతినిధుల ఇష్టాగోష్ఠి (Revanth Reddy Chitchat)లో అనేక అంశాలను ప్రస్తావించారు. ప్రధానంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలు ఉండవు అన్న అంశాలను ప్రస్తావిస్తూ తెరాసలో హుజూరాబాద్ ఉపఎన్నిక తర్వాత తిరుగుబాటు తప్పదన్నారు. విజయగర్జన సభ పెడతామని కేసీఆర్ ప్రకటించడం రాబోయే తిరుగుబాటును ఎదుర్కోవడానికేనని ఆరోపించారు.

పార్టీలో జరుగుతున్న పరిణామాలతో కేసీఆర్ భయంతోనే ఉన్నారని అది బయటపడకుండా ప్రవర్తిస్తున్నారన్నారు. ముందస్తు ఎన్నికలు రావని కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్న రేవంత్... ఎన్నికల షెడ్యూల్ ప్రకారం పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు కలిసి రావని, 6 నెలల ముందే అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని వివరించారు.

అవే చివరి సభలు...

విజయగర్జన సభలు (TRS Vijaya Garjana) కేసీఆర్ (Cm Kcr) భయంతోనే పెడుతున్నారని ఇవే తెరాసకు చివరి సభలు అవుతాయని పేర్కొన్నారు. హరీశ్​రావును కూడా కేసీఆర్ త్వరలో పార్టీ నుంచి బయటికి పంపుతాడని, మిత్ర ద్రోహి పేరుతో బయటకు వెళ్లడం ఖాయమని ప్రస్తావించారు. ఈటల గెలిచినా.. ఓడినా ఎవరికి లాభం లేదని రేవంత్ రెడ్డి అన్నారు. గుజరాత్​తో పాటు తెలంగాణలో ఎన్నికలు వస్తాయన్నారు. మోదీ డైరెక్షన్​లో కేసీఆర్.. గుజరాత్​తో పాటు ముందస్తు ఎన్నికలకు వెళ్తారని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో భాజపాను బలోపేతం చేసే కుట్ర జరుగుతోందని వివరించారు. ఇప్పుడే ముందస్తు ఎన్నికలు అంటే పార్టీలో గందరగోళం వస్తుందని కేసీఆర్ చెప్పడం లేదని అన్నారు.

తిరుగుబాటును ఎదుర్కోవడానికే సీఎం కేసీఆర్ సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నట్లు వెల్లడించారు. ఎవరు అడగకుండానే ముందస్తు ఎన్నికల చర్చ ఎందుకు తీసుకొచ్చారో కేసీఆరే చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంకో రెండున్నరేళ్లు తానే సీఎంగా ఉంటానని కేసీఆర్ ఎమ్మెల్యేలను భయపెడుతున్నట్లు వివరించారు. మళ్లీ తెరాస అధికారంలోకి వస్తోందని రెండేళ్ల ముందే కేసీఆర్ ఎలా చెప్తారని ప్రశ్నించారు. యూపీ ఎన్నికల్లో ఎంఐఎం సహకారంతో భాజపాను బలోపేతం చేయడానికి కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు.

అడగకుండానే...

అడగకుండానే దళిత ముఖ్యమంత్రి, మూడెకరాల భూమి ఆశ చూపి కేసీఆర్ (Cm Kcr) తెలంగాణ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ఏబీసీడీ వర్గీకరణపై మందకృష్ట మాదిగ (Manda Krishna Madiga) 26 ఏళ్లుగా కొట్లాడుతున్నట్లు గుర్తుచేశారు. వర్గీకరణపై ప్రధాని మోదీ (Pm Modi) దగ్గరకు అఖిలపక్షాన్ని తీసుకెళ్తానని కేసీఆర్ మాట తప్పారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీలకు సాగుకు యోగ్యమైన మూడెకరాల భూమి ఇస్తామని 2014 తెరాస మ్యానిఫెస్టోలో పొందుపరిచి మోసం చేసిందన్నారు. తెరాస అధ్యక్ష పదవికి కేసీఆర్.. నామినేషన్ ప్రక్రియలో ఒక్క దళిత నేతను కూడా భాగస్వామిని చేయలేదని (Revanth Interesting Comments) ఎత్తిచూపారు. కేసీఆర్​తో వేదిక పంచుకోవటానికి ఎంపీ రాములు, కడియం శ్రీహరి, ఎంపీ పసునూరి దయాకర్​లాంటి వాళ్లు పనికిరారా అని ప్రశ్నించారు. కేసీఆర్ దళితులను నమ్మడని.. దళితులు కూడా కేసీఆర్​ను నమ్మడం లేదన్నారు.

ఇదీ చూడండి: GHMC response on Revanth tweet: రేవంత్ ట్వీట్.. కేటీఆర్​కు ట్యాగ్.. జీహెచ్​ఎంసీ షాక్

Last Updated : Oct 18, 2021, 7:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.