ETV Bharat / state

tpcc chief revanth reddy: 'ఇంటికో ఓటు.. కాంగ్రెస్​కు వేయండి' - కాంగ్రెస్​ నేతలతో రేవంత్​ సమావేశం

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో (huzurabad by poll) "ఇంటికో ఓటు... కాంగ్రెస్‌కు వేయండి" అనే నినాదాన్ని ఇంటింటికీ తీసుకు వెళ్లాలని టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు (revanth reddy on huzurabad election campaign). నిరుద్యోగ యువత, విద్యార్థులు, కొత్త ఓటర్లను ఆకట్టుకునేలా ప్రచారం ఉండాలని అయన సూచించారు.

tpcc chief revanth reddy
tpcc chief revanth reddy
author img

By

Published : Oct 21, 2021, 3:19 PM IST

హుజూరాబాద్​ ఉప ఎన్నిక సందర్భంగా.. కాంగ్రెస్​ పార్టీని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలో నేతలకు.. ఆ పార్టీ చీఫ్​ రేవంత్​ రెడ్డి దిశానిర్దేశం చేశారు (revanth reddy on huzurabad election campaign). ఇంటింటికి తిరిగి కాంగ్రెస్‌కు ఓటు ఎందుకు వేయాలో ప్రజలకు తెలపాలని సూచించారు. హుజూరాబాద్‌ ఎన్నికల ఇంఛార్జీలతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జూమ్‌ యాప్ ద్వారా సమావేశమయ్యారు.

ఇందులో భాగంగా వచ్చే వారం రోజులపాటు చేయాల్సిన ప్రచార వ్యూహాలను (campaign methods) నాయకులతో రేవంత్ రెడ్డి చర్చించారు. కాంగ్రెస్ పార్టీ ఒక యువ నాయకుడు, విద్యార్థి నేతకు టికెట్‌ ఇచ్చి ప్రోత్సహించిన విషయాన్ని యువతలోకి తీసుకు వెళ్లాలని తెలిపారు. భాజపా, తెరాస మోసపూరిత విధానాలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, నష్టాలను వివరించాలని పేర్కొన్నారు. భాజపా, తెరాస లోపాయికారి ఒప్పందాలు, చీకటి రాజకీయాలను బయట పెట్టాలని నేతలకు సూచించారు. కాంగ్రెస్‌ వైపు ప్రజలు ఉండేలా ప్రచార వ్యుహాలను అమలు చేయాలన్నారు.

ఈ జూమ్‌ మీటింగ్‌లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఎన్నికల మేనేజ్‌మెంట్‌ కమిటీ ఛైర్మన్ దామోదర రాజనర్సింహ, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, మల్లు రవి, ప్రధాన కార్యదర్శి హర్కర వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: Revanth complained to EC: రాష్ట్ర ఎన్నికల అధికారిని కలిసిన రేవంత్‌ రెడ్డి.. పక్కనే నిరోషా..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.