టూరిజం అభివృద్ధిపై కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ దూరదృశ్య సమీక్ష నిర్వహించారు. ఇందులో రాష్ట్ర పర్యాటక శాఖమంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, సంబంధింత అధికారులు పాల్గొన్నారు. మహబూబ్‌నగర్‌లో ఉన్న ఎకో అర్బన్ టూరిజం పార్క్ అభివృద్ధి, టెంపుల్ టూరిజంలో భాగంగా యాదాద్రి, మన్యంకొండ వెంకటేశ్వరస్వామి దేవస్థానాల్లో పర్యాటక కేంద్రాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రికి శ్రీనివాస్ గౌడ్ వివరించారు.
హైదరాబాద్ నగరంలో దుర్గం చెరువుపై దేశంలో అతిపెద్ద కాంక్రీటు సస్పెన్షన్ బ్రిడ్జిని నిర్మించిన విషయాన్ని ప్రహ్లాద్ దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణలో స్వదేశీ దర్శన్, ప్రసాద్ పథకాల కింద కేంద్రానికి పలు ప్రతిపాదనలు పంపించామని.. వాటిని వెంటనే ఆమోదించి పర్యాటక అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: వాటి వల్లే అభివృద్ధికి ఆటంకం: కేటీఆర్