ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​@9PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOPTEN NEWS FOR 9PM
టాప్​టెన్​ న్యూస్​@9PM
author img

By

Published : May 1, 2021, 9:00 PM IST

రేపే లెక్కింపు

నాగార్జునసాగర్ నియోజకవర్గ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నల్గొండలోని ఆర్జాలబావి వద్ద ఉన్న రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ప్రాంగణంలో... రేపు లెక్కింపు జరగనుంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియ కోసం ఇవాళ ముందస్తు కార్యక్రమం నిర్వహించారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

వైద్య ఆరోగ్యశాఖ సీఎంకు బదిలీ

తెరాస సీనియర్‌ నేత ఈటల రాజేందర్‌ను మంత్రివర్గం నుంచి తొలగించే దిశగా ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఈటలను ఆయన నిర్వహిస్తున్న వైద్యారోగ్య శాఖను కొద్దిసేపటి క్రితం తప్పించింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

పథకం ప్రకారమే

పథకం ప్రకారమే తనపై దాడి జరుగుతోందని ఈటల రాజేందర్​ అన్నారు. మెరుగైన సేవలందించే వైద్య ఆరోగ్యశాఖను తన నుంచి తప్పించారని, ఏ శాఖనైనా తీసుకునే అధికారం సీఎంకు ఉందన్నారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

హైదరాబాద్‌కు స్పుత్నిక్ వి టీకాలు

రష్యా స్పుత్నిక్ వి టీకాలు హైదరాబాద్‌కు చేరుకున్నాయి. మాస్కో నుంచి ప్రత్యేక విమానంలో ఈ టీకాలను తీసుకువచ్చారు. ఈ వ్యాక్సిన్​ను వినియోగించనున్న దేశాల్లో భారత్ 60వ స్థానంలో ఉంది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

బంద్​

కరోనా కట్టడిలో భాగంగా హైదరాబాద్​లోని నెహ్రూ జూలాజికల్ పార్క్, వరంగల్​లోని కాకతీయ జూ పార్క్​లను మూసివేస్తున్నట్లు అటవీ సంరక్షణ ప్రధాన అధికారి శోభ వెల్లడించారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ఎర్ర చందనం పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న 7.4 మెట్రిక్ టన్నుల ఎర్ర చందనాన్ని చెన్నై నౌకాశ్రయంలో కస్టమ్స్​ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 5.6 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

వేసవి సెలవులు

కరోనా వ్యాప్తి దృష్ట్యా సుప్రీం కోర్టుకు ముందస్తుగా వేసవి సెలవులు ప్రకటించారు. ఈ నెల 14 నుంచి కాకుండా 10 నుంచే సెలవులు ఇవ్వాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్​వీ రమణ నిర్ణయించారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

లాక్​డౌన్​ పొడిగింపు

కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టని నేపథ్యంలో దిల్లీలో మరోసారి లాక్​డౌన్​ పొడిగిస్తున్నట్లు ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. ఈ విషయాన్ని సీఎం కేజ్రీవాల్​ శనివారం ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

వార్నర్​పై వేటు..

ఐపీఎల్ 14వ సీజన్​లో వరుస ఓటములతో ఢీలాపడ్డ సన్​రైజర్స్ హైదరాబాద్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ జట్టు కెప్టెన్సీ నుంచి వార్నర్​ను తప్పించింది. అతడిని తుదిజట్టులోకి తీసుకునే వీలులేదని చెప్పకనే చెప్పింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

28వ సినిమా ఫిక్స్​​

'సర్కారు వారి పాట' తర్వాత హీరో మహేశ్​బాబు నటించనున్న కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది. త్రివిక్రమ్​ దర్శకత్వంలో సూపర్​స్టార్​ సినిమా ఖరారైంది. 2022 వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.