1.చారిత్రక విజయం
32 ఏళ్ల తర్వాత గబ్బాలో ఆస్ట్రేలియాకు ఓటమి రుచి చూపించింది టీమ్ ఇండియా. ఆఖరి టెస్టులో ఆసీస్‌పై మూడు వికెట్ల తేడాతో చారిత్రక విజయాన్ని నమోదు చేసింది భారత్. ఈ విజయంతో 2-1తేడాతో టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
2.రూ.5 కోట్ల నజరానా
ఆసీస్‌తో జరిగిన నాల్గో టెస్ట్‌లో భారత్ 2-1 తేడాతో ఘన విజయం సాధించి.. బోర్డర్ గావస్కర్ ట్రోఫీని వరుసగా మూడోసారి సొంతం చేసుకుంది. ఈ చారిత్రక గెలుపుపై హర్షం వ్యక్తం చేస్తూ... టీమ్ ఇండియాకు రూ.5 కోట్ల నజరానా ప్రకటించింది బీసీసీఐ. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
3.అభినందన
ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించటంతో టీమ్ ఇండియా ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురుస్తోంది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ భారత జట్టుకు అభినందనలు తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
4.పరిశీలన
కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా సీఎం కేసీఆర్ మేడిగడ్డను సందర్శించారు. అంతకు ముందు ముక్తేశ్వరస్వామిని దర్శించుకున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
5.భాజపాతోనే
రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వస్తేనే అభివృద్ధి జరుగుతుందని సినీ నటి, భాజపా జాతీయ నేత విజయశాంతి అన్నారు. హైదరాబాద్ నాగోల్‌లో... భాజపా తెలంగాణ మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
6.దుష్ప్రచారం
కేంద్ర ప్రభుత్వం రైతు ఉద్యమంపై దుష్ప్రచారం చేస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. సాగు చట్టాల వల్ల రైతులకు కలిగే నష్టాలను వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున మంగళవారం ఓ బుక్‌లెట్‌ను విడుదల చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
7.మరో 45 లక్షల డోసులు
కేంద్రం మరో 45 లక్షల డోసుల కొవాగ్జిన్ టీకాను కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. ఇందులో 8 లక్షల డోసులను పలు మిత్రదేశాలకు ఉచితంగా అందిస్తారని సమాచారం. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
8.బైడెన్ బంపర్ ఆఫర్!
అధ్యక్షునిగా బైడెన్ అధికారం చేపట్టిన తొలిరోజే వలసలకు సంబంధించి కీలక బిల్లు ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లు ద్వారా కోటి పది లక్షల మంది వలసదారులు లబ్ధిపొందనున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
9.సెన్సెక్స్ 600 ప్లస్
స్టాక్‌మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 650 పాయింట్లు పెరిగి 49 వేల 214 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 186 పాయింట్లు లాభంతో 14 వేల 467 వద్ద ఉంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
10.కమల్‌కు సర్జరీ..
లోకనాయకుడు కమల్ హాసన్.. కాలికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆపరేషన్ విజయవంతంగా పూర్తయ్యిందని ఆయన కుమార్తెలు శ్రుతి హాసన్, అక్షరా హాసన్‌లు ట్విట్టర్లో వెల్లడించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.