1. ప్రగతికి శ్రీకారం
సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో తొలిసారి.. నిరుపేదల సొంతింటి కల నెరవేరింది. ప్రభుత్వం ఉచితంగా అందిస్తోన్న రెండు పడక గదుల ఇళ్లను ముఖ్యమంత్రి ప్రారంభించారు. గేటెడ్ కమ్యూనిటీ తరహాలో నాణ్యతలో రాజీపడకుండా ఈ ఇళ్లను నిర్మించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. పోటెత్తిన భక్తులు
ఆదివారం సెలవు రోజు కావడంతో యాదాద్రిలో రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఆలయ పరిసరాలన్నీ సందడిగా మారాయి. బాలాలయంలో మంత్రి ఎర్రబెల్లి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. చిన్నప్పటి చిట్టిబాబు..ఆ తర్వాత ఏమయ్యాడు!
అల్లూరి సీతారామరాజు.. ఇది పేరు మాత్రమే కాదు.. ఓ పోరాట చరిత్ర. బ్రిటిష్ వాళ్లను గజగజలాడించిన విప్లవ కెరటం. మన్యంలో సమరానికి సై అంటూ.. ఎగిసిపడిన నిప్పు కణిక. సమరనాదానికి రూపం ఇస్తే.. విప్లవ నినాదానికి ఆయువు పోస్తే.. కనిపించే రూపం.. అల్లూరి. మన్నెం ప్రజల కోసం పోరాడిన అమరుడు.. అల్లూరి కథ ఎప్పటికీ స్ఫూర్తిదాయకమే.. నేడు ఆయన జయంతి.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. కోట్లు విలువైన హెరాయిన్ సీజ్
మత్తుపదార్థాలు సరఫరా చేస్తున్న ఓ స్మగ్లర్‌ను అరెస్టు చేశారు మహారాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారులు. రూ. 879కోట్లు విలువచేసే 300 కేజీల హెరాయిన్‌ను సీజ్ చేసినట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. కూలిన సైనిక విమానం
ఫిలిప్పీన్స్‌లో విమానం కూలిన ఘటనలో 17 మంది మృతి చెందారు. ఈ మేరకు ఆ దేశ రక్షణ మంత్రి డెల్ఫిన్ లోరెంజనా తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6.పోలీసులపై జనం దాడి
ఓ కేసులో నిందితుడిని పట్టుకోవడానికి వెళ్లిన పోలీసులపై అక్కడి స్థానికులు మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ ఘటన.. మహారాష్ట్ర ఠాణె జిల్లాలోని భీవండి పట్టణంలో జరిగింది. మొత్తం వ్యవహారంలో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7.టీ స్టాల్లో ప్లేట్లు కడిగిన వానరం!
అక్కడా ఇక్కడా తిరుగుతూ దొరికినవి తింటూ కాలక్షేపం చేసే ఓ కోతి.. పని బాట పట్టింది. చెట్లపై గెంతి.. జనావాసాల్లో తిరిగి తిరిగి బోర్కొట్టిందో ఏమో.. అచ్చం మనిషిలాగా టీ స్టాల్లో ప్లేట్లు కడుగుతూ దర్శనమిచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8.పిక్సల్స్ ఎక్కువ ఉంటేనే మంచి ఫోనా?
గూగుల్ పిక్సెల్ లాంటి ఫోన్లలో 12 మెగా పిక్సల్ కెమెరా నాణ్యమైన ఫొటోలను తీస్తుంది. ఇది ఇతర కంపెనీల 108 ఎంపీ ఫోన్ కెమెరాలతో పోటీ పడుతుంది. కొన్ని సార్లు వీటి కంటే మంచి ఫొటోలనూ తీస్తుంది. ఎందుకలా? అసలు మెగా పిక్సల్ అంటే ఏమిటి? మెగా పిక్సల్స్ ఉన్నంత మాత్రాన మంచి ఫొటోలు వస్తాయా? తెలుసుకుందాం రండి.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. 'స్వేచ్ఛగా ఆడితే విజయం మనవెంటే'
ర్యాంకింగ్స్‌లో పదో స్థానంలో ఉన్నప్పటికీ.. టోక్యో ఒలింపిక్స్‌లో భారత మహిళల హాకీ జట్టు అత్యుత్తమ ప్రదర్శన చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు కోచ్ స్జోర్డ్ మారిజ్నే. స్వేచ్ఛగా, నిర్భయంగా ఆడితే ఫలితం దానంతట అదే వస్తుందని తెలిపాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. దర్శకుడు శంకర్‌కు ఊరట
'భారతీయుడు 2' వివాదంలో(Indian 2 Controversy) దర్శకుడు శంకర్‌కు ఊరట లభించింది. ఆయనపై ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వేసిన పిటిషన్‌ను(Lyca Productions Plea) మద్రాసు హైకోర్టు కొట్టివేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.