1. సీఎం ఆకాంక్ష
రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయ ప్రారంభ సంవత్సరంగా, రైతు పండుగగా ప్రసిద్ధి గాంచిన ఉగాది శుభాలు కలుగజేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీ ప్లవ నామ సంవత్సరంలో రైతులకు అంతా మంచే జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. లాస్ట్ వార్నింగ్
వరంగల్ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్... భాజపా నేతలపై విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ వయసు, హోదా చూడకుండా భాజపా నేతలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను దూషిస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్న కేటీఆర్... ఇదే చివరి హెచ్చరిక అని తేల్చి చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. రసవత్తరంగా..
విమర్శలు, ప్రతివిమర్శలతో నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారం కాక రేపుతోంది. మండే ఎండల్లోనూ పార్టీల నేతలు ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ప్రచార గడువు తేదీ దగ్గరపడుతున్న కొద్దీ... గ్రామాగ్రామాన తిరుగుతూ ఓటర్లను కలుసుకుంటున్నారు. పార్టీ గెలుపే లక్ష్యంగా.. ఓట్ల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. కట్టలు తెంచుకున్న ఆగ్రహం
పోడు భూముల విషయంలో కొంత కాలంగా అటవీ శాఖ అధికారులు, గిరిజనులకు మధ్య తలెత్తిన వివాదాలు చినికి చినికి గాలివానగా మారాయి. అటవీభూముల్లో ఆదివాసులు పోడుకొట్టి సాగు చేసుకుంటున్న భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకునే క్రమంలోనే ఘర్షణలు తలెత్తుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. ఎండా వానా..!
దేశంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తెలంగాణ, తమిళనాడు, కేరళ సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అయితే.. ఈ ప్రభావం వల్ల ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టకపోవచ్చని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. దీదీ ప్రచారంపై ఒకరోజు నిషేధం
బంగాల్ శాసనసభ ఎన్నికల్లో అధికార టీఎంసీ, భాజపా మధ్య హోరాహోరీ పోరు నెలకొన్న వేళ.. అనూహ్య పరిణామం జరిగింది. బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. 24గంటలపాటు ఎన్నికల ప్రచారం చేయకుండా ఎన్నికల సంఘం నిషేధం విధించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. 'సెరోజా' బీభత్సం
ఆస్ట్రేలియాలో సెరోజా తుపాను విధ్వంసం సృష్టించింది. గంటకు సుమారు 170 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీయగా.. పలు చోట్ల భారీ వృక్షాలు నేలకూలాయి, వందల ఇళ్లు ధ్వంసమయ్యాయి. విద్యుత్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. మరింత పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం
వినియోగదారు ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) మరోసారి భారీగా పెరిగింది. మార్చిలో సీపీఐ 5.52 శాతంగా నమోదైనట్లు కేంద్ర గణాంక కార్యాలయం(ఎన్ఎస్ఓ) వెల్లడించింది. 2021 ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.03 శాతంగా ఉన్నట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. చిందులేసిన సన్‌రైజర్స్ ఆటగాళ్లు
ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మన్, సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌కు క్రికెట్ అంటే ఎంత ఇష్టమో.. డ్యాన్స్ అన్న అంతే మక్కువ. తాజాగా తన ఐపీఎల్ సహచరులతో కలిసి చిందులేస్తున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. డబ్బుకోసం కాదు
డబ్బు కోసం 'మేజర్' సినిమా తీయలేదని అన్నారు యువ హీరో అడివి శేష్. 2008లో ముంబయి దాడుల్లో చనిపోయిన మేజర్ ఉన్నికృష్ణన్ ఫొటోలు చూసినప్పుడు తన సొంత అన్నయ్యను కోల్పోయినట్లు అనిపించిందని చెప్పారు. ఈ చిత్రం ఎంతో మంది హృదయాలను తాకుతుందని చెప్పుకొచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.