నిధులు ఇవ్వండి
కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌కు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. ఫార్మాసిటీ, జహీరాబాద్ నిమ్జ్‌కు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 2021-22 బడ్జెట్‌లో ప్రాజెక్టు వ్యయంలో కనీసం సగం మొత్తం కేటాయించాలని కోరారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
దా'రుణ' యాప్‌లు
ఆన్లైన్లో రుణాలిచ్చి అధిక వడ్డీ వసూలు చేస్తున్న మొబైల్ యాప్‌ల దారుణాలపై ఆర్బీఐ స్పందించింది. ఆర్బీఐ గుర్తింపు పొందని యాప్‌లో రుణాలు తీసుకుని ఇబ్బందుల్లో చిక్కుకోకూడదని ప్రజలకు సూచించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
బీ అలర్ట్
కొత్త రకం కరోనా వైరస్‌తో మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. యూకే నుంచి వచ్చిన వారి వివరాలు ఆరా తీయాలని అధికారులను ఆదేశించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
దయనీయస్థితిలో
ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై మరోసారి మండిపడ్డారు మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి. సీఎం తీసుకున్న గ్రామాలు దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయని ఆరోపించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
సింగరేణి ఆవిర్భావ వేడుకలు
సింగరేణి ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో సింగరేణి పతాకాన్ని సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ ఆవిష్కరించారు. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనే శక్తి, సామర్థ్యం సింగరేణికి ఉందన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
చర్చలకు సిద్ధం
నిర్మాణాత్మక ప్రతిపాదనలతో వస్తే చర్చలకు సిద్ధమని రైతు సంఘాల నాయకులు స్పష్టం చేశారు. నూతన వ్యవసాయ చట్టాలపై అర్థంలేని సవరణలను తమ వద్దకు తీసుకురావొద్దని తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
చర్చలకు రండి
వ్యవసాయ రంగంలో తీసుకురావాల్సిన సంస్కరణలు ఇంకా చాలా ఉన్నాయన్నారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులు త్వరలోనే కేంద్రంతో మరోసారి చర్చించడానికి ముందుకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
13,600పైకి నిఫ్టీ
స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 437 పాయింట్లు బలపడి 46,440పైకి చేరింది. నిఫ్టీ 135 పాయింట్లు పెరిగి 13,600 మార్క్ దాటింది. హెచ్‌యూఎల్ అత్యధికంగా 2.50 శాతానికిపైగా లాభాలన్ని గడించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
క్రీడా వివాదాలు..
ప్రతి ఏడాది ఎన్నో సంఘటనలు జ్ఞాపకాలుగా నిలుస్తాయి. కానీ ఈ 2020ను రివైండ్ చేసుకుంటే మహమ్మారి కరోనానే అందరి జీవితాల్లో సింహభాగంగా నిలిచింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
అందరూ చూడొచ్చు
అందాలతార శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్, అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలీ నందా.. తమ ఇన్‌స్టా ఖాతాలను పబ్లిక్ చేశారు. వారు ఏమేం పంచుకున్నారో మీరూ ఓ లుక్కేయండి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.