అగ్రరాజ్యం సైతం తెలంగాణపైనే ఆధార పడుతోంది: మంత్రి కేటీఆర్
యూఎస్ ఐబీసీ ఇన్వెస్ట్మెంట్ వెబినార్‌లో మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అమెరికన్ కంపెనీల అధినేతలకు రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
ఇదేం న్యాయం... ప్లకార్డు పట్టుకుంటేనే అరెస్టు చేస్తారా: రేవంత్
కాంగ్రెస్ కార్యకర్త సాయిబాబా అరెస్ట్‌పై కమిషనర్‌తో ఎంపీ రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ప్లకార్డు పట్టుకుంటే అరెస్టు చేయడమేంటని సీపీని రేవంత్ ప్రశ్నించారు. కేసును పరిశీలించి వదిలేస్తామని సీపీ... రేవంత్‌కు తెలిపారు. మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి.
జన సమీకరణ ఎలా చేస్తారు: హైకోర్టు
జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి.. నిమ్జ్ ఏర్పాటుపై జరగాల్సిన ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా పడింది. కరోనా దృష్ట్యా.. రేపటి ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
మరోసారి భూ ప్రకంపనలు... ఇళ్లలోనుంచి పరుగులు తీసిన ప్రజలు
సూర్యాపేట జిల్లాలోని పలు మండలాల్లో భూప్రకంపనలు సంభవించాయి. ఇవాళ మధ్యాహ్నం నాలుగు సెకన్లపాటు సంభవించిన ఈ ప్రకంపనల వల్ల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి.
'సైనిక ఉపసంహరణే... ఉద్రిక్తతలకు ముగింపు కాదు'
లద్దాఖ్‌లోని సమస్యాత్మక ప్రాంతాల్లో భారత్- చైనా తమ బలగాలను ఉపసంహరించుకుంటున్నాయి. దీని అర్థం ఉద్రిక్తతలు పూర్తిగా తగ్గినట్లు కాదని సైనిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
కరోనా మందుల దందా- ధర 6 రెట్లు అధికం
కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కొందరు డ్రగ్ వ్యాపారులు మాత్రం డబ్బులు దండుకోవడమే పనిగా పెట్టుకున్నారు. కొవిడ్ రోగుల చికిత్సలో ఉపయోగించే రెమ్‌డెసివిర్‌ను బ్లాక్మార్కెట్లో విక్రయిస్తున్నారు. మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి.
సరిహద్దుల్లో దేశం కోసం.. గ్రామ శివారులో కుటుంబం కోసం
దేశ సరిహద్దుల్లో సైనికుడిగా విధులు నిర్వహిస్తున్న ఓ జవాన్... ఇటీవల స్వగ్రామానికి చేరుకున్నాడు. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో నేరుగా ఊరులోకి వెళ్లకుండా గ్రామ శివారులో తన పొలంలో ట్రాక్టర్‌పై టెంట్ వేసుకుని క్వారంటైన్లో ఉన్నాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
టీసీఎస్‌పై కరోనా దెబ్బ- రూ.1123కోట్లు తగ్గిన లాభం
తొలి త్రైమాసికంలో సాఫ్ట్వేర్ దిగ్గజం టీసీఎస్ నికర లాభం 13.8 శాతం తగ్గింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.8,131 కోట్ల నికర లాభం పొందగా.. ఈ సారి రూ.7008 కోట్లకే పరిమితమైంది. ఆదాయం మాత్రం సల్వంగా పెరిగింది. మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి.
సచిన్, కోహ్లీ బంతికి చిక్కిన ప్రముఖ క్రికెటర్లు వీరే
టీమ్ఇండియా క్రికెట్ చరిత్రలో తమకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్నారు సచిన్ తెందుల్కర్, విరాట్ కోహ్లీ. బ్యాట్‌తో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించారు. కొన్నిసార్లు బంతితోనూ మెరిశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
మిచెల్ ఒబామా, మెగన్ మార్కెలతో ప్రియాంక చోప్రా
ఈనెల 13 నుంచి 15వ తేదీల మధ్య వర్చువల్ విధానంలో జరిగే 'గర్ల్‌అప్ లీడర్‌షిప్ సమ్మిట్'లో ప్రత్యేక అతిథిగా పాల్గొనుంది నటి ప్రియాంక చోప్రా. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్లో వెల్లడించింది. మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి.