కొత్తగా 247 కేసులు
తెలంగాణలో కరోనా మళ్లీ కోరలు చాస్తోంది. కొత్తగా 247 కేసులు నమోదయ్యాయి. మహమ్మారి సోకి ముగ్గురు మృతి చెందారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
ఆత్మహత్యాయత్నం
నిజామాబాద్ జిల్లాలో యువతీయువకుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి యువతి మృతి చెందగా.. యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
బ్రిజేష్ ట్రైబ్యునల్ విచారణ
తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదం రగులుతూనే ఉంది. ఈ క్రమంలో నేటి నుంటి బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్.. ఈ సమస్యపై విచారణ చేపట్టనుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
రాత్రికి తొలి రౌండ్ ఫలితాలు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రాత్రికి తొలి రౌండ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
ఒక్కరోజే 29వేల మందికి
దేశంలో కొవిడ్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. ఒక్కరోజే దాదాపు 29వేల కేసులు నమోదయ్యాయి. అప్రమత్తమైన ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పలు ఆంక్షలు విధిస్తున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
తేదీలు ఖరారు
ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ పర్యటన తేదీలను వెల్లడించింది విదేశీ వ్యవహారాల శాఖ. ఈ నెల 26, 27 తేదీల్లో మోదీ బంగ్లాదేశ్‌లో ప్రర్యటించనున్నట్లు తెలిపింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
భాజపా ఎంపీ మృతి
హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ ఎంపీ రామ్ స్వరూప్ శర్మ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. దిల్లీలోని తన నివాసంలో ఆయన మృతదేహాన్ని గుర్తించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
స్వల్ప లాభాల్లో సూచీలు
ఐటీ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. దీంతో మొదట నష్టాలో ప్రారంభమైన మార్కెట్లు పుంజుకుంటున్నాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 52 పాయింట్లు పెరిగి 50,416 వద్దకు చేరింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 5 పాయింట్ల స్వల్ప లాభంతో 14,916 వద్ద కొనసాగుతోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
జట్టులో కొనసాగుతాడు
ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న టీ20 సిరీస్‌లో దారుణంగా విఫలమవుతున్నాడు టీమ్ఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండుసార్లు డకౌట్‌గా వెనుదిరిగాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
ప్రభాస్ సరసన 'కేజీఎఫ్' బ్యూటీ!
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో 'సలార్' చిత్రం రూపొందుతోంది. ఇందులో ఓ ప్రత్యేక గీతం కోసం 'కేజీఎఫ్' బ్యూటీ శ్రీనిధి శెట్టిని సంప్రదించినట్లు సమాచారం. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.