1. మరో 945 కేసులు
రాష్ట్రంలో మరో 945 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 16,339కు చేరింది. వైరస్ బారిన పడి 260 మంది మృతిచెందారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
2. ప్రవేశ పరీక్షలు వాయిదా
ఎంసెట్ సహా ప్రవేశ పరీక్షలన్నీ మరోసారి వాయిదా పడ్డాయి. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ చేపట్టిన హైకోర్టు ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ప్రవేశ పరీక్షలు సహా, టైప్ రైటింగ్ పరీక్షలు కూడా వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనానికి ఏజీ నివేదించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
3.రైతులకు శుభవార్త
అన్నదాతలకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. గత యాసంగి మార్కెట్ సీజన్‌కు సంబంధించిన జొన్న, మొక్కజొన్న, శనగపప్పు, పొద్దుతిరుగుడు పంటల బకాయిలు మొత్తం రూ.210 కోట్లు విడుదల చేసింది. ఆ మొత్తాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
4. బాధ కలిగించాయి
రాష్ట్రంలో కరోనా వ్యాప్తిపై ప్రజలు ఆందోళన చెందుతున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా బాధితుడు ఆక్సిజన్ అందడం లేదని.. ఊపిరి ఆడక ఇబ్బంది పడుతున్న విషయాన్ని వీడియో తీసి పంపించే దయనీయ స్థితి వచ్చిందని వాపోయారు. ఈ ఘటనపై ఆరోగ్య శాఖ మంత్రి ఈటల స్పందించిన తీరు బాధించిందన్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
5. ఘోర వైఫల్యం
కొవిడ్ నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందిని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. బాధితులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించకుండా.. కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
6. ఇమ్యునిటీ బూస్టర్
కరోనా నుంచి కోలుకునేందుకు ఆయుర్వేద ఔషధాన్ని విడుదల చేసినట్లు ప్రకటించిన పతంజలి.. తాజాగా ఆ వ్యాఖ్యలపై వెనక్కి తగ్గింది. ఆ ఔషధం కేవలం రోగనిరోధక శక్తిని పెంపొందించేదేనని స్పష్టం చేసింది. మరోసారి క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి సిద్ధమని పేర్కొంది. మరోవైపు కరోనా కిట్లు తయారు చేయడం లేదని వెల్లడించింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
7. నెట్టింట పెళ్లి
కరోనా కారణంగా కార్యకలాపాలన్నీ ఆన్లైన్ ద్వారా సాగుతున్నాయి. డిజిటల్ క్లాసులు, వర్చువల్ మీటింగ్‌లు, వర్క్ ఫ్రమ్ హోమ్ మాత్రమే కాదు.. ఇటీవల పెళ్లిళ్లూ వర్చువల్‌గానే జరుగుతున్నాయి. ఇదే తరహాలో రాజస్థాన్‌కు చెందిన నవదంపతులు వీడియోకాల్ ద్వారా ఒక్కటయ్యారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
8. కరోనా పంజా
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు, మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు 1,04,49,330 కేసులు నమోదయ్యాయి. 5,09,113మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ కొరియా, సింగపూర్, పాకిస్థాన్‌లో వైరస్ విజృంభణ ఆందోళనకరంగా ఉంది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
9. సోషల్ మీడియా సెగ
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ నటించిన 'సడక్ 2' సినిమా.. డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. అయితే ఇప్పటికే ఆలియాపై గుర్రుగా ఉన్న నెటిజన్లు ఈ సినిమాను బాయ్‌కాట్ చేస్తామంటూ సోషల్‌మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
10. ఎంతో నేర్పించింది
2014లో అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌ను ట్విట్టర్ వేదికగా గుర్తు చేసుకున్నాడు టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఆ టోర్నీ తమకు ఎప్పటికీ ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుందని తెలిపాడు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.