1.కర్నల్ కుటుంబానికి ఆర్థిక అండ
గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో మరణించిన కర్నల్ సంతోష్‌బాబు కుటుంబాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. సంతోష్‌బాబు చిత్రపటానికి సీఎం నివాళులర్పించారు. కర్నల్ కుటుంబానికి రూ.5 కోట్ల ఆర్థికసాయం, భార్య సంతోషికి ఆర్డీవో నియామక పత్రం, నివాస స్థలం పత్రాలను అందించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.
2. కాంస్య విగ్రహం ఏర్పాటు
సూర్యాపేట జిల్లా కేంద్రంలో కర్నల్ సంతోష్‌బాబు కాంస్య విగ్రహం ఏర్పాటు చేసి.. ఓ కూడలికి సంతోష్‌బాబు నామకరణం చేయనున్నట్లు మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. ఆయన కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసానిచ్చారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.
3.ప్రభుత్వానికి కృతజ్ఞతలు
ముఖ్యమంత్రి కేసీఆర్ కర్నల్ సంతోశ్ బాబు కుటుంబాన్ని పరామర్శించడం పట్ల... కర్నల్ భార్య హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి, తెలంగాణ ప్రభుత్వానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.
4.పరీక్ష కేంద్రాలు మార్చుకోవచ్చు
ఎంసెట్ రాసే విద్యార్థులు పరీక్ష కేంద్రాలు మార్చుకునే అవకాశం కల్పించినట్టు కన్వీనర్ వెల్లడించారు. మొదటి విడతలో ఏపీకి, రెండో విడతలో ఏపీ నుంచి తెలంగాణకు మార్చుకోవచ్చని తెలిపారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.
5.సరిహద్దు ఉద్రిక్తం
భారత్- చైనా సరిహద్దులో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇరు దేశాలు భారీ స్థాయిలో ఆయుధ సామగ్రి, యుద్ధ ట్యాంకులను సరిహద్దుకు చేరవేస్తున్నాయి. చైనా దాడులకు తెగబడితే ఎదుర్కొనేందుకు భారత బలగాలు సిద్ధమవుతున్నాయి. సరిహద్దు పరిస్థితిపై అగ్రశ్రేణి కమాండర్లతో చర్చించారు సైనికాధిపతి నరవాణె. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.
6.భారత్- చైనా దౌత్యస్థాయి చర్చలు!
త్వరలోనే భారత్-చైనా మధ్య దౌత్యస్థాయిలో చర్చలు జరిగే అవకాశముందని తెలుస్తోంది. ఇందు కోసం ఇరు దేశాల అధికారులు ఓ తేదీని నిర్ణయించే పనిలో ఉన్నట్టు సమాచారం.పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.
7.శ్రీలంకలో రాజకీయ దుమారం
తాను ఒక్కడినే 2000 మందికిపైగా భద్రతా సిబ్బందిని హత్య చేసినట్టు.. ఎల్టీటీఈ (లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం) మాజీ డిప్యూటీ కరుణ అమ్మన్ చేసిన వ్యాఖ్యలు శ్రీలంకలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరుణ అమ్మన్ వ్యాఖ్యలపై దర్యాప్తు జరపాలని శ్రీలంక ప్రభుత్వం పోలీసులను ఆదేశించింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.
8.పసిడి ధర- నేటి లెక్కలివే
బంగారం ధర సోమవారం స్వల్పంగా తగ్గింది. 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి.. 85 రూపాయలు తగ్గి దేశ రాజధాని దిల్లీలో రూ.48,811కు చేరింది. వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. దిల్లీలో కిలో వెండి రూ. 144 పెరిగి రూ. 49,736కు చేరింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.
9.రోగ నిరోధక శక్తి పెంచుకోవచ్చు ఇలా..
వ్యాయామాలతో రోగనిరోధక శక్తి పెంచుకోవచ్చని చెబుతోంది భారత షట్లర్ పీవీ సింధు. ప్రస్తుతం కరోనాకు మందు లేని కారణంగా మనలోని ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుకోవడమే ఉత్తమమని తెలిపింది. దానికి తగ్గట్లుగా ప్రతి ఒక్కరూ రోజూ కసరత్తులు చేయాలని విజ్ఞప్తి చేసింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.
10.సినిమా షూటింగ్ షురూ
మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా పులి వాసు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'సూపర్ మచ్చి'. ఈ సినిమా షూటింగ్ నేడు రామానాయుడు స్టూడియోలో పునఃప్రారంభమైంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.