.ఆయువు తీసిన వాయువు ఏపీలో ఘోర రసాయన ప్రమాదం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో విషాదం జరిగింది. ఇప్పటికే 9 మంది చనిపోగా.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సుమారు 300 మంది అస్వస్థతకు గురయ్యారు. మరిన్ని వివరాలు మీకోసం...వి'శోకం'అందరూ గాఢనిద్రలో ఉన్నారు. ఒక్కసారి అరుపులు, కేకలు. ఏం జరుగుతుంతో తెలుసుకునేలోపే పెను ప్రమాదం జరిగిపోయింది. ఏపీలోని విశాఖలో జరిగిన గ్యాస్ లీకేజీ ప్రమాదం అందరి హృదయాలను కలచివేస్తోంది. ప్రధాని సమీక్షవిశాఖ ఘటనపై ప్రధాని ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గ్యాస్ లీకేజీ, మృతులు, క్షతగాత్రులు తదితర విషయాలపై చర్చించారు. అసలేం జరిగిందనే దానిపై సమీక్షించారు. ప్రముఖల సంతాపంవిశాఖపై ప్రముఖులు స్పందిస్తున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. ఆ వివరాలు లైవ్ అప్డేట్ కోసం క్లిక్ చేయండి.దురదృష్టకరంఆంధ్రప్రదేశ్లోని విశాఖ గ్యాస్ లీకేజీ ప్రమాదంపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. ఇదో దురదృష్టకరమైన రోజుగా అభివర్ణంచారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.లీకేజీపై జగన్ ఆరాఆర్.ఆర్. వెంకటాపురం గ్యాస్ లీక్ ఘటనపై ఏపీ సీఎం జగన్ ఆరా తీశారు. కలెక్టర్, కమిషనర్లతో ఫోన్ ద్వారా మాట్లాడారు. తక్షణమే సహాయకార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బాధితులను నేరుగా కలవనున్నారు జగన్మోహన్ రెడ్డి.చంద్రబాబు దిగ్భ్రాంతిఆంధ్రప్రదేశ్ విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు అత్యున్నత వైద్య సాయం అందించాలని సూచించారు. ఈ ఘటనపై లోకేశ్ విచారం వ్యక్తం చేశారు.మరో 56ఏపీ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇవాళ 56 కేసులు నమోదయ్యాయి.వాళ్లే అధికంఅమెరికాలోని న్యూయార్క్‌లో కరోనా సోకిన వారిలో ఎక్కువ మంది విశ్రాంత ఉద్యోగులు, నిరుద్యోగులే ఉన్నట్లు సర్వేలో తేలింది. వారిలో నాలుగింట మూడొంతుల మంది 50ఏళ్లు పైబడిన వారే కావడం గమనార్హం.అన్నికోట్లా!'పుష్ప'లోని ఓ ఫైట్‌ను సుమారు రూ.6 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించనున్నారట. లాక్డౌన్ ఎత్తివేయగానే దీనికి సంబంధించిన చిత్రీకరణ ప్రారంభమవుతుంది. ఇందులో లారీ డ్రైవర్‌గా కనిపించనున్నాడు బన్నీ.