ETV Bharat / state

టాప్ ​టెన్​ న్యూస్​@11AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS AT 11
టాప్​టెన్​ న్యూస్​@11AM
author img

By

Published : Aug 23, 2020, 10:59 AM IST

  • అంచనాలకు.. వాస్తవ సాగుకి పొంతన లేదు

నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేయాలని ప్రభుత్వం రైతులకు సూచించింది. ఇందుకోసం ప్రణాళికలు సైతం రూపొందించింది. అయితే, గణించిన పంట లెక్కలకు... వాస్తవ సాగుకి మధ్య పొంతన లేకుండా పోయింది. 2020-21కి సంబంధించి వ్యవసాయ శాఖ విడుదల చేసిన నివేదికలో ఈ విషయం స్పష్టమైంది. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • రైతన్నల నేస్తాలు... ఈ స్టార్టప్‌లు!

ఆర్థిక సమస్యలూ, ప్రకృత్తి విపత్తులు ఎన్నింటినో ఎదుర్కొంటూ రెక్కలు ముక్కలు చేసుకునే అన్నదాతల గురించి ఆలోచించారు కొందరు యువకులు. వారి కోసమే స్టార్టప్‌లు పెట్టి మేలు చేసే యంత్రాల్ని తయారు చేస్తున్నారు... గిట్టు బాటు ధర కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు. మరి ఇంతకీ ఆ స్టార్టప్‌లు ఏంటంటే...

  • లడ్డూ వేళం లేకుండానే...

కొవిడ్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకొని.. బాలాపూర్​లో ఈసారి గణేశ్​ ఉత్సవాలను సాధారణంగా నిర్వహిస్తామని బాలాపూర్ గణేశ్​ ఉత్సవ సమితి ప్రకటించింది. హైదరాబాద్​లో ఖైరతాబాద్ తర్వాత ఎంతో ప్రాశస్త్యం కలిగిన బాలాపూర్ గణనాథుడు ఈసారి ఆరు ఆడుగుల్లో దర్శనమివ్వనున్నారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • భగీరథ ప్రయత్నం ఫలించింది..

మంచినీళ్లకై ఎదురుచూస్తూ.. మైళ్లకొలది నడిచి వెళ్లే పరిస్థితులన్నింటికీ చరమగీతం పాడింది మిషన్​ భగీరథ. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ప్రజలందరికీ ఇళ్ల వద్దకే శుద్ధి చేసిన నీటిని నల్లాల ద్వారా అందిస్తూ తెలంగాణ దేశంలోనే అగ్రభాగాన నిలిచింది. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • షాదీముబారక్​ డబ్బు కొట్టేశారు..

సైబర్‌ నేరగాళ్లు సరికొత్త పంథాలో చెలరేగిపోతున్నారు. అమాయకులను బురిడీ కొట్టిస్తూ లూటీ చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌ చాంద్రాయణగుట్టకు చెందిన ఓ వ్యక్తిని... సైబర్‌నేరగాళ్లు నిలువు దోపిడి చేశారు. షాదీముబారక్‌ డబ్బులు చేతికి అందకముందే గుర్తుతెలియని వ్యక్తులు తమిళనాడులోని ఎస్​బీఐలో ఎన్‌క్యాష్‌ చేశారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • భారీ అగ్ని ప్రమాదం..

సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో రసాయనాల నిల్వ ఉంచే గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది. గోదాంలోని రసాయనాల డ్రమ్ములకు నిప్పు అంటుకోగా.. మంటలు ఎగిసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • 30 లక్షలు దాటిన కరోనా కేసులు..

దేశవ్యాప్తంగా కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కరోజే రికార్డు స్థాయిలో 69,239 కేసులు నమోదు కాగా.. మరో 912 మంది కొవిడ్​కు బలయ్యారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • వ్యాక్సిన్​ ట్రయల్స్ ఆలస్యం..

మానవులపై కరోనా వ్యాక్సిన్​ ట్రయల్స్​ను నెమ్మదింపజేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఎఫ్​డీఏపై మండిపడ్డారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్. పరీక్షలు నిర్వహించేందుకు ఔషధ సంస్థలకు సహకరించడం లేదని ఆరోపించారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • ధోనీ అంతర్జాతీయ కెరీర్​పై హోల్డింగ్ ప్రశంసలు

టీమ్​ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్​పై స్పందించాడు వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ మైఖెల్ హోల్డింగ్. వికెట్​ కీపర్​గా ఉంటూ బ్యాటింగ్​లోనూ మహీ అద్భుత ప్రదర్శన చేశాడని కొనియాడాడు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • పెళ్లికి రెడీ అయిన సాయితేజ్​

టాలీవుడ్ హీరో, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తన పెళ్లి శుభవార్త చెప్పేందుకు సిద్ధమయ్యాడు. దీనికి సంబంధించిన ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.