ETV Bharat / state

Telangana Top News: టాప్​ న్యూస్ @3PM

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు

author img

By

Published : Jul 13, 2022, 3:00 PM IST

Telangana Top News
టాప్​ న్యూస్ @1PM
  • మహిళపై గ్యాంగ్​రేప్.. డ్రగ్స్ ఇచ్చి..

ఉత్తర్​ప్రదేశ్ మథురలో దారుణమైన అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడిన దుండగులు.. అత్యంత పాశవికంగా ప్రవర్తించారు. రేప్ చేసిన తర్వాత.. మహిళ కాళ్ల పైనుంచి బైక్​ను పోనిచ్చారు. అనంతరం, బాధితురాలిని అడవిలో పడేశారు. కోసికాలా పోలీస్ స్టేషన్​లో మే 24న జరిగిన ఈ ఘటన ఇప్పుడు బయటపడింది. మంగళవారం ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

  • సామర్థ్యానికి మించి కడెం ప్రాజెక్టుకు వరద

ఎడతెరపిలేని భారీ వర్షాలతో కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. 1995 సంవత్సరం తర్వాత ఈ స్థాయిలో వరద రావడం ఇదే ప్రథమమని అధికారులు అంటున్నారు. ప్రాజెక్టు సామర్థ్యానికి మించి వరద రావడంతో మొదట ఆందోళన చెందిన అధికారులు.. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉండటంతో ఊపిరి పీల్చుకున్నారు. కడెం ప్రాజెక్టు నీటిమట్టంపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కడెం ప్రాజెక్టు వరద ఉద్ధృతిపై ఆరా తీశారు.

  • పిల్లాడిని మింగిందని మొసలిపై డౌట్..

పిల్లాడిని మింగేసిందన్న అనుమానంతో మొసలిని చిత్రహింసలకు గురిచేశారు ఓ గ్రామ ప్రజలు. బాలుడు మొసలి కడుపులో బతికే ఉన్నాడని, ఎలాగైనా బయటకు తీయాలని రకరకాల ప్రయత్నాలు చేశారు. అటవీ శాఖ సిబ్బంది నచ్చజెప్పి ఆ మొసలికి విముక్తి కల్పించారు. నదిలో గాలించగా ఆ బాలుడు శవమై కనిపించాడు.

  • పోటెత్తిన వరదలు.. ఉగ్రరూపం దాల్చిన ప్రాజెక్టులు

రాష్ట్రంతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. గోదావరి, కృష్ణతో పాటు వాటి ఉపనదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నారు. ఉరకలెత్తుతున్న వాగుల నుంచి వస్తున్న వరదతో ప్రాజెక్టులు జలకళను సంతరించుకోగా.. చెరువులు, కుంటలు మత్తడి దూకుతున్నాయి. చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులు పూర్తిగా నిండి.. వరద దిగువకు ఉరకలెత్తుతోంది. భారీ ప్రవాహంతో భారీ తరహా ప్రాజెక్టుల్లోకి వరద పోటెత్తుతుండగా.. కొన్ని ఇప్పటికే గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు.

  • నిత్యానంద స్వామికి 18 అడుగుల విగ్రహం

నిత్యానందస్వామికి 18 అడుగుల విగ్రహాన్ని నిర్మించాడు ఓ భక్తుడు. ఈ ఘటన తమిళనాడులోని విల్లుపురంలో జరిగింది. బాలసుబ్రమణ్యం అనే భక్తుడు పెరంబాయి గ్రామంలోని ఐశ్వర్య నగర్​లో ఈ విగ్రహాన్ని నెలకొల్పాడు. దీంతో పాటు మలేసియాలోని ప్రఖ్యాత మురుగన్ ఆలయం మాదిరిగా 27 అడుగుల విగ్రహాన్ని నిర్మించాడు. తన గ్రామంలో నిర్మించిన ఈ ఆలయానికి బాతుమలై మురుగన్​ అని నామకరణం చేశాడు.

  • 'రూ.4,389కోట్ల కస్టమ్స్​ సుంకం ఎగవేత!'

ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో.. ఏకంగా రూ.4,389 కోట్ల కస్టమ్స్ సుంకం చెల్లించకుండా ఎగ్గొట్టినట్లు తేలింది. ఒప్పో సహా అనుబంధ సంస్థల కార్యాలయాలు, ఉన్నత ఉద్యోగుల నివాసాల్లో సోదాల తర్వాత ఈ విషయం నిర్ధరించినట్లు డైరక్టరేట్​ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్​-డీఆర్​ఐ వెల్లడించింది.
మొబైల్ ఫోన్ల తయారీ కోసం ఒప్పో భారత్​కు దిగుమతి చేసుకున్న కొన్ని వస్తువుల వివరాల్ని తప్పుగా చూపినట్లు ఆధారాలు లభించాయని పేర్కొంది.

  • టీమ్​ఇండియా సూపర్​ ఫామ్​.. ఆ జాబితాలో..

ఇంగ్లాండ్‌పై తొలి వన్డేలో విజయం సాధించిన టీమ్​ఇండియా.. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌ విడుదల చేసిన తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో ముందడుగు వేసింది. దీంతో పాకిస్థాన్‌ను వెనక్కి నెట్టి మూడో స్థానానికి చేరుకొంది. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌ ప్రారంభానికి ముందు భారత్ 105 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది.

  • చెట్టును ఢీకొట్టిన ఆటో.. ముగ్గురు మృతి

ఆదిలాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఉట్నూర్‌ మండలం గోదరిగూడ సమీపంలో ఆటో చెట్టును ఢీకొట్టింది. ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులు నిర్మల్‌ జిల్లా కుంటాల, భైంసా వాసులుగా గుర్తించారు.

  • శ్రీలంకలో ఎమర్జెన్సీ- టీవీ ఛానల్​ బంద్

శ్రీలంకలో నిరసనకారుల ఆందోళనలు మరోసారి తీవ్రస్థాయికి చేరుకుంటున్న నేపథ్యంలో ఆ దేశ అధికారిక టీవీ ఛానల్​ రూపవాహిని తన ప్రసారాలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ విషయాన్ని స్థానిక మీడియా వెల్లడించింది. కొలొంబోలోని ఛానల్​ కార్యాలయాన్ని ఆందోళకారులు చుట్టుముట్టడం వల్లే ఆ సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

  • చిరంజీవి సాంగ్స్​కు కోహ్లీ డ్యాన్స్​!

మెగాస్టార్​ చిరంజీవి సాంగ్స్​, డ్యాన్స్​కు ఎలాంటి క్రేజ్​ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అభిమానులు ఆయనలా అనుకరిస్తూ.. ఆ పాటలకు ఇప్పటికీ చిందులేస్తుంటారు. అయితే టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ కూడా చిరు సాంగ్స్​కు అదిరే స్టెప్పులేసేవాడట. ఆ సంగతేంటో చూద్దాం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.