ETV Bharat / state

Telangana News Today: టాప్​న్యూస్​ 7AM - Telugu top ten news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana News Today
టాప్​న్యూస్​ 7AM
author img

By

Published : Sep 5, 2022, 7:00 AM IST

  • షాపింగ్‌ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం..

CHINTALMET FIRE ACCIDENT: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ చింతల్‌మెట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రధాన రహదారి పక్కన ఉన్న ఓ షాపింగ్‌ కాంప్లెక్స్‌పై విద్యుత్​ తీగలు తెగిపడి మంటలు చెలరేగాయి. చూస్తుండగానే షాపింగ్‌ క్లాంప్లెక్స్‌లోని 5 దుకాణాలకు మంటలు వ్యాపించాయి. ఘటనలో దుకాణాల ముందు నిలిపి ఉంచిన 5 కార్లు దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు.

  • ఓడిన భారత్‌.. ప్రతీకారం తీర్చుకున్న పాక్

ఆసియా కప్‌ గ్రూప్‌ దశలో పాకిస్థాన్‌పై పైచేయి సాధించిన టీమ్‌ఇండియా.. కీలకమైన సూపర్‌-4 దశలో ఆ జట్టుకు తలవంచింది. ఆదివారం హోరాహోరీ పోరులో భారత్‌ 5 వికెట్ల తేడాతో ఓడింది.

  • బ్రిటన్ తదుపరి ప్రధానిగా.. లిజ్ ట్రస్ ఎన్నిక లాంఛనమేనా?

Britain Pm Election Result: బ్రిటన్​ తదుపరి ప్రధానమంత్రి ఎవరనే ఉత్కంఠకు సోమవారం తెరపడనుంది. బోరిస్ జాన్సన్‌ వారసుడి పదవికి లిజ్‌ ట్రస్‌, భారత సంతతి నేత రిషి సునాక్‌ పోటీ పడ్డారు. శుక్రవారంతో కన్జర్వేటివ్‌ పార్టీ సభ్యుల ఓటింగ్ ప్రక్రియ ముగియగా.. సోమవారం ఫలితాలు ప్రకటించనున్నారు. సునాక్‌పై లిజ్‌ ట్రస్‌ విజయం సాధిస్తారని సర్వేలు వెల్లడిస్తున్నాయి.

  • 'దేశంలో విద్వేషం పెరుగుతోంది.. ఆ ఇద్దరు మాత్రం లాభపడుతున్నారు'

భాజపా, ఆరెస్సెస్ దేశాన్ని విడగొడుతున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ద్రవ్యోల్బణం పెరగడం వల్ల దేశంలో విద్వేషం అధికమవుతోందని అన్నారు. దీని వల్ల ఇద్దరు పారిశ్రామికవేత్తలు లాభపడుతున్నారని ఆరోపించారు.

  • గతంలో గుజరాత్‌ సీఎంగా ఉన్న మోదీ.. మన్మోహన్‌ సింగ్‌ ఫొటో పెట్టారా?'

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యలపై మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. కేంద్ర ఆర్థికమంత్రి వ్యాఖ్యలు అసంబద్ధంగా ఉన్నాయని మండిపడ్డారు. కేంద్రం నిధులు ఉపయోగిస్తే మోదీ ఫోటో పెట్టాల్సిందే అని మాట్లాడటంలో ఔచిత్యం లేదన్నారు.

  • కేంద్రమంత్రి గారు.. మోదీ సర్కార్ చేసిన అప్పుల సంగతేంటి..?

ట్విటర్ వేదికగా మంత్రి కేటీఆర్ మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. తెలంగాణ అప్పులపై మాట్లాడుతున్న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్.. కేంద్రం అప్పులపై కూడా స్పందించాలని ట్విటర్ వేదికగా డిమాండ్ చేశారు. మోదీ పుణ్యమా ఇప్పుడు ప్రతీ భారతీయుడిపై లక్షా 25వేల అప్పు ఉందని ట్వీట్ చేశారు.

  • టాటా సన్స్​ మాజీ ఛైర్మన్​ మిస్త్రీ కన్నుమూత

టాటా సన్స్​ మాజీ ఛైర్మన్, ప్రముఖ పారిశ్రామిక వేత్త​ సైరస్​ మిస్త్రీ(54) కన్నుమూశారు. మహారాష్ట్ర ముంబయి సమీపంలోని పాల్ఘర్​ జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. అహ్మదాబాద్​ నుంచి ముంబయి వెళ్తుండగా.. ఆయన ప్రయాణిస్తున్న మెర్సిడెస్​ కారు డివైడర్​ను ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు.

  • 'తొలి త్రైమాసిక వృద్ధిరేటు.. ఆందోళన కలిగించే విషయమే'

Duvvuri Subbarao About GDP Growth : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో నమోదైన వృద్ధిరేటు ఆందోళన కలిగించే విషయమని ఆర్​బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. వృద్ధిరేటుపై పడే ప్రతికూల ప్రభావాలపై మాట్లాడారు. 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్ధిక వ్యవస్థలా భారత్​ రూపాంతరం చెందాలంటే ప్రతి ఏటా స్థిరమైన వృద్ధిరేటు ఉండాలని చెప్పారు.

  • 'బ్రహ్మాస్త్ర' మేకింగ్​ వీడియో విడుదల.. తెర వెనక కష్టమిదీ

భారీ బడ్జెట్​తో తెరకెక్కిన చిత్రం 'బ్రహ్మాస్త్ర'. రణ్‌బీర్‌, అలియా భట్‌, అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున, మౌనీరాయ్‌ కలిసి నటించిన ఈ సినిమా తొలి భాగం ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అయాన్‌ ముఖర్జీ మేకింగ్‌ వీడియోను విడుదల చేశారు.

  • రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన మంచు మనోజ్​

తన రెండో పెళ్లిపై మంచు మనోజ్‌ స్పందించారు. నగరంలోని ఓ వినాయక మండపాన్ని దర్శించుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో 'మీరూ మౌనిక పెళ్లి చేసుకోబోతున్నారని వదంతులు వినిపిస్తున్నాయి. దాని గురించి ఏమంటారు?' అని ఒకరు అడగ్గా అది వ్యక్తిగత విషయమని, సందర్భం వస్తే తప్పకుండా చెబుతానని మనోజ్‌ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.