ETV Bharat / state

Telangana News Today: టాప్​న్యూస్ @9AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

author img

By

Published : Jul 18, 2022, 8:59 AM IST

Telangana News Today
టాప్​న్యూస్ @9AM
  • ఈరోజు భారీ వర్షాలున్నాయ్..

రాష్ట్రంలో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఒడిశా తీరంపై అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి.

  • నేటి నుంచే ఎంసెట్... ఆ నిబంధన సడలింపు

ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే... ఎంసెట్ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఇవాళ, రేపు, ఎల్లుండి ఇంజినీరింగ్ విభాగం పరీక్ష జరగనుంది. రోజూ రెండు పూటలు పరీక్ష నిర్వహిస్తుండగా... ఒక్కో సెషన్‌కు సుమారు 29 వేల మంది హాజరుకానున్నారు. ఒక్క నిమిషం నిబంధన అమలు చేస్తున్నందున.. విద్యార్థులు ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.

  • వైభవంగా లష్కర్ బోనాలు... నేడు రంగం

సికింద్రాబాద్‌ బోనాల జాతర అంగరంగ వైభవంగా సాగుతోంది. ఆదివారం తెలవారుజామునుంచే అమ్మవారిని దర్శించుకున్న భక్తులు... బోనాలు, ఒడిబియ్యం, సారె, సమర్పించారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెల్లవారు జామున 4 గంటలకే అమ్మవారికి తొలి బోనం సమర్పించగా... ఎమ్మెల్సీ కవిత 2000 మంది మహిళలతో ఊరేగింపుగా వచ్చి మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, మల్లారెడ్డి, ఎంపీ రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.

  • సర్వం వరదార్పణం.. బాధితుల వేదన వర్ణనాతీతం..

గోదావరికి క్రమేణా వరద తగ్గుముఖం పడుతుండగా, కృష్ణాలో శ్రీశైలానికి ప్రవాహం కొనసాగుతోంది. భద్రాచలం వద్ద కూడా నెమ్మదించినప్పటికీ, ఇంకా ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తోంది. మరోపక్క నీటమునిగిన జయశంకర్‌ జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ పంపుహౌస్‌లో నీటి తోడివేత(డీవాటరింగ్‌)కు అధికారులు చర్యలు చేపడుతున్నారు. మంత్రపురిగా పిలుచుకునే మంథని పట్టణ చరిత్రలోనే ఎన్నడూ లేనిరీతిలో వరద ముంచెత్తింది. భద్రాద్రి జిల్లా మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు మండలాల్లో ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఐదు రోజులుగా ప్రాణాలరచేత పట్టుకుని ఉన్న బాధితులు ఇప్పుడు ఆస్తి, పంట నష్టంపై అంచనా వేసుకుంటున్నారు.

  • వైకాపా మళ్లీ అధికారంలోకి వస్తే.. అధోగతే

వైకాపా మరోసారి అధికారంలోకి వస్తే ఏపీని ఎవరూ బాగు చేయలేరని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. విధానపరమైన లోపాల గురించి ప్రశ్నిస్తే అసభ్యంగా తిడుతున్నారని, ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి వైకాపా అరాచక పాలనను అంతం చేయాలని పిలుపునిచ్చారు.

  • మద్యం తాగి వాహనం నడుపుతున్నారా..

పంజాబ్‌లో ఇకపై ఎవరైనా అదుపులేని వేగంతో లేదా మద్యం మత్తులో డ్రైవింగ్‌ చేస్తే సామాజిక సేవ గానీ, రక్తదానం గానీ చేయాల్సి ఉంటుంది. ఇలా పట్టుబడిన వారికి జరిమానా విధిస్తూనే ఇలాంటి కార్యక్రమాలు కూడా చేయిస్తారు. ఈమేరకు వివిధ రకాల ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై చేపట్టే చర్యలకు సంబంధించి రాష్ట్ర రవాణా శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

  • డ్రాగన్​తో సఖ్యత సాధ్యమేనా..

భారత్​, చైనా ద్వైపాక్షిక సంబంధాలపై ఆశలు చిగురిస్తున్నాయి. ఉభయ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు తిరిగి మెరుగవుతున్నాయని, రెండు దేశాలు పలు అంశాల్లో ఒకే రకమైన ప్రయోజనాలను, అవసరాలను కలిగి ఉన్నాయని చైనా ఇటీవల ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు తూర్పు లద్దాఖ్‌లో ఘర్షణకు కేంద్ర బిందువులైన అన్ని ప్రాంతాల నుంచి చైనా దళాలు వైదొలగాల్సిందేనని ఇరుదేశాల మధ్య జరిగిన 16వ విడత ఉన్నతస్థాయి సైనిక చర్చల్లో భారత్‌ స్పష్టం చేసింది.

  • మాల్​ ఫుడ్​ కోర్ట్​లో కాల్పుల కలకలం..

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. ఆదివారం సాయంత్రం ఇండియానా మాల్​లోని ఫుడ్​ కోర్టులో ప్రవేశించిన ఓ సాయుధుడు రైఫిల్​తో కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో నిందితుడు సహా నలుగురు మరణించారు. మొదట దుండగుడు ముగ్గురు పౌరులను కాల్చిచంపగా.. అనంతరం ఓ పౌరుడు నిందితుడిని కాల్చి చంపినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మరో ఇద్దరికి గాయాలైనట్లు పేర్కొన్నారు.

  • ఆ విమర్శలకు చెక్​ పెడుతూ..

బాధ్యతగా ఆడడు, నిర్లక్ష్యం ఎక్కువ, పరిపక్వత లేదు, వికెట్‌ పారేసుకుంటాడు అన్నవి పంత్‌పై తరచూ వచ్చే విమర్శలు. అయితే అద్వితీయ పోరాటం చేసిన ఈ ఎడమచేతి వాటం కుర్రాడు.. సంచలన బ్యాటింగ్‌తో ఇటీవల కాలంలో వన్డే క్రికెట్లో గొప్ప ఇన్నింగ్స్‌ల్లో ఒకటి అనదగ్గ ఇన్నింగ్స్‌ ఆడాడు. అసాధారణ పట్టుదలను ప్రదర్శిస్తూ, అత్యంత బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో ఆ విమర్శలకు బదులిచ్చాడు.

  • నెరిసిన జుట్టుతో.. స్టార్​ హీరోలు

ఒకప్పటితో పోల్చితే ప్రేక్షకుల అభిరుచుల్లో ఇప్పుడు చాలా మార్పులొచ్చాయి. కొత్తదనం నిండిన కథల్ని ఇష్టపడుతున్నారు. అభిమాన తారల్ని కొత్త రకమైన వేషధారణలో చూసుకోవాలని ఆశపడుతున్నారు. అందుకే కొన్నాళ్ల క్రితం వరకు 'ప్రయోగాలు అవసరమా?' అని భావించిన హీరోలు సైతం లుక్కులోనూ.. గెటప్పులోనూ వైవిధ్యం చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడీ క్రమంలోనే పలువురు అగ్ర కథానాయకులు సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ లుక్‌తో మురిపించేందుకు సిద్ధమయ్యారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.