ETV Bharat / spiritual

ఆ రాశులవారికి ఈ రోజుల అన్ని ప్రతికూల ఫలితాలే - శివారాధన చేస్తే మేలు! - DAILY HOROSCOPE

అక్టోబర్ 13వ తేదీ (శనివారం) రాశిఫలాలు

Daily Horoscope
Daily Horoscope (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 13, 2024, 4:21 AM IST

Horoscope Today 13th October 2024 : 2024 అక్టోబర్ 13వ తేదీ (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో దూకుడు తగ్గించుకుంటే మంచిది. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. స్నేహితులతో వ్యాపారపరమైన చర్చలతో కాలం గడుపుతారు. చర్చలతో కాలయాపన చేయకుండా కార్యరంగంలోకి దిగితే పనులు సులభంగా పూర్తవుతాయి. బంధుమిత్రులతో విందువినోదాలలో పాల్గొంటారు. వృధా ఖర్చులు తగ్గించుకోండి. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఎదురయ్యే సమస్యలు పరిష్కరించడం కష్టతరంగా మారుతుంది. కుటుంబసభ్యులు, సన్నిహితుల సహకారంతో పరిస్థితి కొంత అదుపులోకి వస్తుంది. ఆర్థిక పరిస్థితి తలకిందులవుతుంది. పరిస్థితులు తిరిగి చక్కబడటానికి కొంత సమయం పడుతుంది. నిరాశ చెందకండి. కఠిన శ్రమ, సహనం తప్పకుండా సత్ఫలితాన్ని ఇస్తుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది.

.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. గ్రహ సంచారం బాగాలేనందున అన్ని విషయాలలో చుక్కెదురు అవుతుంది. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా ప్రతికూల పరిస్థితులు ఎదురు కావడంతో సహనం కోల్పోతారు. నిరాశావాదం వీడి ప్రశాంతంగా ఉండడం అలవరచుకోండి. ప్రతికూల ఆలోచనలను వీడితే మంచిది. ముఖ్యమైన పనులు, ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. అనారోగ్యం, పనుల్లో ఆటంకాలు, ప్రమాదాలు సంభవించడం, ఆర్థిక వ్యవస్థ స్థంభించిపోవడం వంటి ప్రతికూల ఫలితాలు అనుభవించాల్సి వస్తుంది. అన్ని సమస్యలకు మౌనమే పరిష్కారం. శనిస్తోత్రం పఠిస్తూ శివారాధన చేస్తే ప్రతికూలతలు తొలగిపోతాయి.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ఈ రోజు తాము నమ్మిన సిద్ధాంతాలతో రాజీపడకుండా ఉన్నతంగా పనిచేసి విజయాన్ని సాధిస్తారు. ఆర్థికంగా సంతృప్తికరమైన ఫలితాలు అందుకుంటారు. వృత్తి జీవితం, వ్యక్తిగత జీవితం ఆనందంగా సాగడానికి అవసరమైన ప్రణాళికలు వేసుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీలక్ష్మీ ధ్యానం మేలు చేస్తుంది.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు లేకపోవడం చికాకు కలిగిస్తుంది. ప్రతికూల ఆలోచల కారణంగా కుటుంబ సభ్యులతో, సన్నిహితులతో గొడవలు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాల కారణంగా మానసిక ప్రశాంతత లోపిస్తుంది. జలగండం ఉంది జలాశయాలకు దూరంగా ఉండండి. ఖర్చులు పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆదిత్య హృదయం పారాయణ శ్రేయస్కరం.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటారు. వృత్తి పరమైన సమస్యల గురించి శ్రేయోభిలాషులతో చర్చిస్తారు. వేదాంతం, మతం వంటి విభిన్నమైన విషయాలపై దృష్టి సారిస్తారు. గతంలోని చేదు జ్ఞాపకాలను మరచి కొత్త జీవితానికి శ్రీకారం చుడతారు. ఆర్థిక ఎదుగుదలపై దృష్టి సారిస్తే ప్రయోజనం ఉంటుంది. ఆరోగ్యం కొంచెం ఇబ్బంది పెడుతుంది. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు ఆనందంగా గడిచిపోతుంది. వృత్తి వ్యాపారాలకు సంబంధించి ఎన్నో ఆశ్చర్యాలను చూస్తారు. వృత్తిపరమైన, వ్యాపారపరమైన చర్చల్లో నిర్ణయం తీసుకోవాల్సిన వంతు మీపై ఉంటుంది. బంధు మిత్రులతో సరదాగా గడుపుతారు. మీ వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. శివారాధనతో మేలు జరుగుతుంది.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు వృత్తి వ్యాపారాలలో ధైర్యంతో ముందడుగు వేస్తే కార్యసిద్ధి ఉంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. చిత్తశుద్ధితో పనిచేసి లక్ష్యాలను సాధిస్తారు. వ్యాపారులకు ఊహించని లాభాలుంటాయి. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త ప్రాజెక్టులు, వెంచర్లు మొదలు పెట్టడానికి మంచి రోజు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. నూతన వస్త్రాభరణాలు కొంటారు. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గత తప్పిదాల నుంచి నేర్చుకున్న పాఠాలతో ఏకాగ్రతతో పనిచేసి విజయం సాధిస్తారు. టీమ్ లీడర్​గా మీ టీమ్ విజయం కోసం అహర్నిశలు పాటుపడతారు. అయితే మీ కృషికి గుర్తింపు రాకపోవడం వల్ల నిరాశతో ఉంటారు. ఎటువంటి ప్రశంసలు రాకపోవడం మీకు నిరాశ కలిగిస్తుంది. మీ స్వధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులుండవచ్చు. హనుమాన్ చాలీసా పారాయణ మేలు చేస్తుంది.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో చికాకు కలిగించే సంఘటనలు ఎదురైనా కుటుంబ జీవితం సంతోషకరంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో అండతో అన్ని కష్టాలను అధిగమిస్తారు. సన్నిహితులతో విందు వినోదాలలో పాల్గొంటారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్య సహకరిస్తుంది. గణపతి ఆలయ సందర్శన శుభకరం.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. ఈ రాశి వారు ఈ రోజు ముఖ్యంగా ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తారు. ధార్మిక కార్యక్రమాల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు. తీర్థయాత్రలకు వెళ్తారు. గత కొంతకాలంగా పెండింగులో ఉన్న లీగల్ వ్యవహారాలు సెటిల్ చేసుకుంటారు. ఉద్యోగులకు పదోన్నతులు ఉంటాయి. నూతన బాధ్యతలను స్వీకరిస్తారు. సమాజంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. వృత్తి వ్యాపారాలలో పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏ పని చేపట్టిన విజయం వెన్నంటే ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభప్రదం.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. కీలకమైన వ్యవహారాలలో వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. ఆర్థికపరమైన మోసాలకు గురి అయ్యే అవకాశం ఉంది. అందుకే జాగ్రత్తగా ఉండండి. కుటుంబ వ్యవహారాలలో సరైన సమయంలో తీసుకునే నిర్ణయాలు దీర్ఘకాలిక ప్రయోజనాలను ఇస్తాయి. ఖర్చులు అదుపులో ఉంచుకోవడం అవసరం. ఈశ్వరుని ఆలయ సందర్శన మేలు చేస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.