- గోదావరి @ 60 అడుగులు
భద్రాచలం వద్ద గోదావరి మహోగ్రరూపం దాల్చింది. చివరిదైన మూడో హెచ్చరికను దాటి ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. ఇప్పటికే గోదావరి నీటిమట్టం 60 అడుగులకు చేరింది. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- ఉన్నతస్థాయి సమీక్ష..
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్నాహ్నం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులకు ఆదేశాలు, సూచనలు చేస్తున్నారు. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- దర్యాప్తు ముమ్మరం
సంచలనం సృష్టించిన కీసర తహసీల్దార్ లంచం కేసులో అనిశా దర్యాప్తు ముమ్మరం చేసింది. ప్రభుత్వ, అసైన్డ్, వివాదస్పద భూములు కాజేసేందుకు కుట్ర జరిగినట్లు అనుమానం వ్యక్తం చేసింది. గతంలో తహసీల్దార్ నాగరాజు అవినీతి అక్రమాలపై అనిశా దర్యాప్తు చేపట్టింది. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- రంగు మారింది!
ప్రభుత్వ పాఠశాలల్లో ఇచ్చే ఏకరూప దుస్తుల రంగు మారింది. ఈసారి బాలురకు నీలి ఆకాశం రంగులో నిక్కరు లేదా ప్యాంటు, నారింజ రంగు గళ్లతో కూడిన చొక్కా, బాలికలకు అవే రంగులతో కూడిన పంజాబీ డ్రెస్‌ను అందించనున్నారు. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- కొత్తగా 57,982 కేసులు..
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. 24 గంటల్లో 57,982 కొత్త కేసులు వెలుగు చూశాయి. మరో 941 మంది వైరస్‌కు బలయ్యారు. మొత్తం కేసుల సంఖ్య 26లక్షల 47వేలు దాటగా... మరణాల సంఖ్య 50వేలకు పైనే ఉంది. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- జాబిల్లిపై ఇంటి నిర్మాణం చౌకే!
చందమామపై భవనాలు కట్టుకోవాలనుకునే కలను మరింత చౌక ధరకే సాకారం చేసుకోవచ్చు అంటున్నారు భారత శాస్త్రవేత్తలు. యూరియా, గోరుచిక్కుడు జిగురుతో ప్రత్యేక అంతరిక్ష ఇటుకలు తయారు చేసి ఔరా అనిపిస్తున్నారు. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- ఆగని కార్చిచ్చు..
అమెరికాలో కార్చిచ్చు విస్తరణ కొనసాగుతుంది. కాలిఫోర్నియా రాష్ట్రంలోని అడవుల్లో చెలరేగిన మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. జనావాస ప్రాంతాలకు దావానలం వ్యాపించే ముప్పు ఉంది. ఈ నేపథ్యంలో మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు.
- ఒడుదొడుకుల్లో సూచీలు
ఆరంభంలో లాభాలతో సాగినా అంతలోనే నష్టాలతో స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్నాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ దాదాపు 70 పాయింట్ల నష్టంతో 37,809 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 10 పాయింట్లకుపైగా కోల్పోయి 11,165 వద్ద ఫ్లాట్‌గా ట్రేడవుతోంది. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- రైనా కీ ప్లేయర్...
భారత్‌కు ఆడిన కీలక ఆటగాళ్లలో సురేశ్ రైనా ఒకడని గంగూలీ తెలిపాడు. అతడి భవిష్యత్తు బాగుండాలని ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు చెప్పాడు. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- రజనీ కోసం శ్రీదేవి ఉపవాసం!
అతిలోక సుందరి శ్రీదేవికి తలైవా రజనీకాంత్ అంటే చాలా ఇష్టమట. గతంలో ఓసారి రజనీ అస్వస్థతకు గురైనప్పుడు. ఆయన త్వరగా కోలుకోవాలని వారం రోజుల పాటు ఈమె ఉపవాసం చేశారట. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి