ETV Bharat / state

ఏపీలో రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్న టమాటా

author img

By

Published : Dec 26, 2020, 2:51 PM IST

ఏపీలో టమాటా రైతుల ఆవేదన వర్ణణాతీతంగా ఉంది. గిట్టుబాటు ధర లభించక రైతులు బోరున విలపిస్తున్నారు. కోత ఖర్చులూ రావట్లేదని గగ్గోలు పెడుతున్నారు. ధర దక్కక టమాటాలను రోడ్లపై పారబోస్తున్నామని ఆవేదన చెందుతున్నారు.

ఏపీలో రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్న టమాటా
ఏపీలో రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్న టమాటా

మార్కెట్లో టమాటా కొనాలంటే.. కిలో రూ.12 నుంచి రూ.18 వరకు పలుకుతోంది. మరోపక్క రైతులేమో గిట్టుబాటు ధర దక్కక పారబోస్తున్నారు. కనీసం కోత ఖర్చులూ రావడం లేదని పొలాల్లోనే వదిలేస్తున్నారు. ఏపీలోని చిత్తూరు జిల్లాలో కిలోకు కనిష్ఠంగా రూ.7లకు లభిస్తుంటే.. పక్కనున్న అనంతపురం, కర్నూలు జిల్లాల్లో రెండు రూపాయలు కూడా దక్కడం లేదు.

పంట ఉత్పత్తులకు ఎక్కడెంత ధర లభిస్తుందో రోజువారీ తెలుసుకునేలా సీఎం యాప్‌ తెచ్చారు. ధర తగ్గితే.. మద్దతు ధరకు కొనుగోలు చేయిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ పత్తికొండ మార్కెట్లో మూడు రోజుల నుంచి కొన్నది 103 క్వింటాళ్లే. ఇప్పుడు కోత కోయొద్దని, మార్కెట్‌కు తీసుకురావద్దని అధికారులు చెబుతున్నారు. వారం రోజులుగా ధరలు పతనం కొనసాగుతుండటంతో.. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ‘రెండెకరాల్లో సాగు చేశా.. మార్కెట్‌కు తెచ్చినా అరకొర ధరే ఇస్తుండటంతో పొలంలోనే కోయకుండా వదిలేశాను’ అని కర్నూలు జిల్లా పత్తికొండ మండలం కొండగేరికి చెందిన శివ వాపోయారు. ‘15 కిలోల పెట్టెకు రూ.30 మాత్రమే ఇస్తున్నారు. అందుకే పంట కోయడం లేదు. ఇవే ధరలు కొనసాగితే గొర్రెలకు వదిలేస్తా’ అని అనంతపురం జిల్లా కామక్కపల్లికి చెందిన నాగరాజు ఆవేదనగా చెప్పారు.

కిలో రూ.5కు సరకంతా కొనాలి

రవాణా ఖర్చులు భారమవుతున్నాయనే అయినకాడికి అమ్ముకుంటున్నామని చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని రకాల టమాటాను కిలో రూ.5 చొప్పున కొని, రైతుబజార్లకు సరఫరా చేస్తే.. రైతులకు కొంతవరకు న్యాయం జరుగుతుంది. కర్నూలు నుంచి దక్షిణ, ఉత్తర కోస్తాలకు రవాణా చేయాలంటే ఒక్కో లారీకి రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు అవుతాయి. రోజుకు 20 లారీల సరకు కొన్నా రవాణాకు రూ.5 లక్షలు అవుతుంది. దెబ్బతిన్న టమాటాల ధర తీసేసినా మొత్తంగా రూ.10 లక్షలకు మించదు. వినియోగదారులకు తక్కువ ధరకే టమాటా అందించవచ్చు.

సరకు మొత్తం పారబోశా

రెండెకరాల్లో టమాటాకు రూ.60 వేల వరకు పెట్టుబడి అయింది. బుధవారం ముగ్గురు కూలీలతో 20 గంపలు (500 కిలోలు) కోయిస్తే.. రూ.900 అయింది. 400 రవాణాకు చెల్లించి పత్తికొండ మార్కెట్‌కు తెచ్చా. రెండు గంపలకు (50 కిలోలకు) రూ.40 చొప్పున ధర వేశారు. కోత ఖర్చులు కూడా రాకపోవడంతో మొత్తం సరకును అక్కడే పారబోసి ఉత్తచేతులతో తిరిగివెళుతున్నా. - సుంకన్న, రామచంద్రాపురం, పత్తికొండ మండలం

ఇదీ చదవండి: తెల్లారిన జీవితాలు... రోడ్డు ప్రమాదంలో మరణించిన ఐదుగురు కూలీలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.