బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బలహీనపడినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. తెలంగాణ నుంచి దూరంగా వెళ్లిపోయిందని వెల్లడించింది. అయితే ఈ నెల 11వ తేదీన ఉత్తర మధ్య బంగాళాఖాతం దగ్గరలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
అల్పపీడనం బలహీనపడినప్పటికీ రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది.
రాష్ట్రంలో నిండుకుండల్లా జలాశయాలు
రాష్ట్రంలో కొద్ది రోజులుగా కురుస్తున్న ఏకధాటి వర్షాలతో పాటు.. ఎగువ నుంచి ప్రవాహం తోడై.. రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు నుంచి భద్రాచలం వరకు గోదావరి పరవళ్లు తొక్కుతోంది. దాదాపుగా అన్ని జలాశయాలు గరిష్ఠ నీటిమట్టానికి చేరుకోవడంతో నీటిని దిగువకు వదులుతున్నారు. వీటికి తోడుగా మంజీరాపై ప్రాజెక్టులతో హైదరాబాద్ జంట జలాశయాలు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరాయి.
ఇదీ చూడండి: FLOODS TO DAMS: నిండుకుండల్లా ప్రాజెక్టులు.. అలుగు పారుతున్న 18 వేల చెరువులు