ETV Bharat / state

ఈరోజు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు - weather updates in state

రాష్ట్రంలో ఈరోజు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

Rains with lightning in state
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు
author img

By

Published : Apr 30, 2020, 12:51 PM IST

ఈరోజు, రేపు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. జగిత్యాల, ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, రాజన్న సిరిసిల్ల, కుమురం భీం, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, జనగామ, వరంగల్‌, మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, యాదాద్రి భువనగిరి, నల్గొండ, మహబూబ్‌నగర్‌, సూర్యాపేట జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

దక్షిణ ఛత్తీస్​గఢ్‌ పరిసర ప్రాంతాలలో 1.5 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వెల్లడించింది. నైరుతి మధ్యప్రదేశ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకు పశ్చిమ విదర్భ, ఉత్తర మధ్య మహారాష్ట్ర, మరఠ్వాడ ఇంటీరియర్‌ కర్ణాటక మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని పేర్కొంది. ఈ రెండింటి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ఇవీ చూడండి: బాలీవుడ్ ప్రముఖ నటుడు రిషీ కపూర్​ అస్తమయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.