తెలంగాణలో కొవిడ్ మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో ఇవాళ 25,913 మందికి కొవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 552 కేసులు నమోదయ్యాయి. కరోనా బారి నుంచి ఇవాళ 496 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,753 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. హైదరాబాద్‌లో అత్యధికంగా 316 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డిలో 51, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 36, సంగారెడ్డిలో 28, ఖమ్మంలో 14, నల్గొండలో 12 కేసులు నమోదయ్యాయి.
ఇదీ చూడండి: ఇంటర్ స్థాయికి గురుకులాలు.. సీఎం కేసీఆర్ సమీక్ష