ఉద్యోగుల సమస్యల కొరకై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని టీఎన్జీవో నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిల్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్, మాజీ అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డిలు రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ శాఖల మంత్రి ప్రశాంత్ రెడ్డిని... అధికార నివాసంలో భేటీ అయ్యారు.
ఉద్యోగ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడంలో సహకారం కావాలని కోరారు. మంత్రి దానికి సానుకూలంగా స్పందించారు. బాల సుబ్రహ్మణ్యం మృతికి టీఎన్జీవో కేంద్ర సంఘం నాయకులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.