పీఆర్సీ-2020 అమలులో ఏర్పడే సమస్యలను పరిష్కరించడానికి అనామలీస్ కమిటీని ఏర్పాటు చేయాలని... తెలంగాణ ఎన్జీవో కేంద్ర సంఘం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ను కోరింది. ఉద్యోగులకు 11వ పీఆర్సీ అమలు చేయడం కోసం జూన్ 11న విడుదల చేసిన 10 జీవోలకు గాను ప్రభుత్వానికి... సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్ కృతజ్ఞతలను తెలియజేశారు.
పది జీవోలను పరిశీలించిన తర్వాత ఉద్యోగులకు అనేక అంశాల్లో వ్యత్యాసాలు కనపడిందని తెలిపారు. వాటిని పరిష్కరించడం కోసం వ్యత్యాసాల సవరణ కమిటీ(అనామలీస్ కమిటీ)ని ఏర్పాటు చేయాలని... సీఎస్కు వినతి పత్రాన్ని అందంజేశారు.
ఇదీ చూడండి: Suicide: కరోనా టీకా వేసుకోమన్నారని.. యువకుడు ఆత్మహత్య