హైదరాబాద్ రవీంద్రభారతిలోని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యటక, సాంస్కృతి శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కార్యాలయంలో తెలంగాణ ఉద్యోగుల సంఘ(టీఎన్జీవో) సభ్యులు మంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్‌ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందించారు.
భేటీలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం అధ్యక్షురాలు మమత, టీఎన్జీవో అధ్యక్షులు మామిళ్ల రాజేందర్, మాజీ అధ్యక్షులు కారం రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: పీవీకి భారతరత్న ఇవ్వాలని శాసనసభ ఏకగ్రీవ తీర్మానం