వేతనాల బకాయిలను చెల్లించడానికి ఉత్తర్వులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు టీఎన్జీవో సంఘం కృతజ్ఞతలు తెలిపింది. కొవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో భాగంగా.. మార్చి, ఏప్రిల్, మే నెలలో ఉద్యోగుల జీతాలను, పింఛన్దారుల పెన్షన్లను కోత విధించి తదుపరి చెల్లిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఈ మేరకు టీఎన్జీవో కేంద్ర సంఘం పక్షాన ముఖ్యమంత్రి వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.
బుధవారం జీవో నంబర్ 61 ద్వారా పెన్షనర్లు, ఉద్యోగులకు వేతన బకాయిలను విడతలవారీగా చెల్లించడానికి కేసీఆర్ సుముఖత చూపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా గత కొంతకాలంగా బకాయిపడ్డ అలవెన్స్లను వెంటనే విడుదల చేయాలని కోరారు. రానున్న దసరా పండగ దృష్ట్యా ఉద్యోగులకు హామీ ఇచ్చిన అన్ని సమస్యలను పరిష్కరించాలని.. ముఖ్యమంత్రి చంద్రశేఖర రావుకు విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల సమస్యలు కొంత ఆలస్యమైనప్పటికీ.. ప్రభుత్వం తప్పకుండా ఉద్యోగుల ఆకాంక్షలు అన్నింటిని కూడా నెరవేరుస్తుందని మామిళ్ల రాజేందర్ తెలిపారు. అందుకు తెలంగాణ ఉద్యోగులు ఎవరూ ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు.
ఇదీ చదవండి: పెండింగ్ జీతాలు, డీఏలు ఇప్పించండి: టీఎన్జీవో నేతలు