తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య 74వ వర్ధంతిని తెలంగాణ ఉద్యోగ ఐకాస ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఘనంగా జరిపారు. నాంపల్లిలోని టీఎన్జీవో భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ నందిని సిద్ధారెడ్డి హాజరయ్యారు. కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కొమురయ్య అమరత్వం తెలంగాణ ప్రజా పోరాటాల చరిత్రలో విశిష్టమైనదని ఐకాస ఛైర్మన్ రవీందర్రెడ్డి అన్నారు. స్వరాష్ట్రంలో మన చరిత్ర-మన సంస్కృతి వికాసం కొనసాగుతోందని... అమరవీరుల స్వప్నాలు ఇప్పుడిప్పుడే సాకారమవుతున్నాయని రవీందర్రెడ్డి అభిప్రాయపడ్డారు.