వ్యాక్సిన్ ప్రక్రియను వేగవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ వేేయడానికి అనుమతి స్వాగతిస్తున్నామని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ ఉచితంగా టీకాలు అందించాలని కోరారు.
ఈమేరకు టీఎన్జీవో కేంద్ర సంఘం పక్షాన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతి పత్రాన్ని టీఎన్జీవో రాష్ట్ర సంఘ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయి కంటి ప్రతాప్ అందజేశారు. ఇప్పటికే కొవిడ్ విధుల్లో పనిచేస్తున్న 45 ఏళ్లు పైబడిన ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు... మొదటి, రెండో విడత టీకాను ప్రభుత్వమే ఇచ్చిందన్నారు.
అదేవిధంగా ఇప్పుడు 18ఏళ్లు నిండిన ఉద్యోగులందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని కోరారు... తద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ఉత్సాహంగా పని చేస్తారని తెలిపారు. ఉద్యోగులందరికీ ఉచితంగా టీకాలు వేయడం ద్వారా హాజరుశాతం కూడా పెరుగుతుందని వెల్లడించారు.