రాష్ట్రంలో కరోనా పరీక్షలు పెంచకపోతే ఇబ్బందులు వస్తాయంటూ గవర్నర్ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ ప్రతిస్పందన అప్రజాస్వామికంగా ఉందని తెజస అధ్యక్షుడు కోదండరాం అభిప్రాయపడ్డారు. గవర్నర్ పదవి రాజ్యాంగబద్ధమైనదని ప్రభుత్వం గుర్తించాలని హితవు పలికారు.
ముఖ్యమంత్రిని కలిసే పరిస్థితి లేదు కాబట్టే ప్రజలు తమ సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లుతున్నారన్నారు. ప్రభుత్వానికి సలహాలు, సూచనలు చేసినా... పెడచెవిన పెట్టడం వల్లే గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేశారన్నారు. రాజ్యాంగ విలువలకు లోబడే ప్రభుత్వం వ్యవహారించాలని కోదండరాం సూచించారు.