రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా వ్యాప్తి తీవ్రత అధికమవుతున్నందున ఈనెల 30న జరగనున్న మున్సిపల్ ఎన్నికలు వాయిదా వేయాలని తెజస అధ్యక్షుడు కోదండరాం కోరారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఆయన లేఖ రాశారు.
కొవిడ్ తీవ్రత దృష్ట్యా ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని హైకోర్టు సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు ఐదు మున్సిపాలిటీ ఎన్నికలు వాయిదా వేయాలని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథికి ఈ మెయిల్ ద్వారా ఆయన లేఖను పంపించారు.