పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వం.. ఉద్యోగులు, అధికారులపై ఒత్తిడి తెచ్చి ఓట్లు వేయించుకున్నారని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ ఆరోపించారు. కొంతమంది స్వతంత్ర అభ్యర్థులను తెరాసనే నిలబెట్టిందన్నారు. తెరాస ఇంత చేసినా నామ మాత్రపు మెజార్టీనే వచ్చిందన్నారు. రాజకీయంగా ప్రభుత్వం బలహీనమై పోయిందని తెలిపారు.
ప్రభుత్వం ఓట్లు చీల్చేందుకు అనేక ప్రయత్నాలు చేసిందని ఆ ప్రయత్నాలను సమర్థవంతంగా నిలువరించామని కోదండరామ్ పేర్కొన్నారు. లక్షమంది ఓటర్లు తమకు అండగా నిలిచారని తెలిపారు. నిరంకుశ పాలనను నిలువరించేందుకు పోరాటం కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే రోజుల్లో గడ్డు పరిస్థితులు ఎదుర్కొవాల్సిన అవసరం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ హామీలను నెరవేర్చే వరకు పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: పీవీ గెలిచినట్టా? కేసీఆర్ గెలిచినట్టా?: బండి సంజయ్