ETV Bharat / state

Kodanda ram: 'ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే.. కేసులు, ఫోన్​ ట్యాపింగ్​లు'

author img

By

Published : Aug 6, 2021, 2:15 PM IST

ఎన్నికలప్పుడే ప్రభుత్వానికి అభివృద్ధి పథకాలు గుర్తుకొస్తాయని తెజస అధ్యక్షుడు కోదండ రాం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటే ఒక్క మంత్రి పట్టించుకోవడం లేదని నిరసన వ్యక్తం చేశారు. ఆచార్య జయశంకర్​ జయంతి సందర్భంగా నాంపల్లిలోని తెజస కార్యాలయంలో ఆయన చిత్రపటానికి కోదండరాం పూలమాల వేసి నివాళులర్పించారు.

kodanda ram
కోదండ రాం
ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే.. కేసులు, ఫోన్​ ట్యాపింగ్​లు: కోదండ రాం

ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెట్టడంతోపాటు ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. ప్రభుత్వం ప్రగతిభవన్‌కే సొంతం అన్నట్లుగా ఉందని.... మంత్రులంతా హుజురాబాద్‌కే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటే కనీసం ఒక్క మంత్రి స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాంపల్లిలోని తెజస కార్యాలయంలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. కోదండ రాం, పార్టీ నేతలు.. జయశంకర్​ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

సంఘటితం కావాలి

ఎన్నికలప్పుడే ప్రభుత్వానికి అభివృద్ధి పథకాలు గుర్తుకొస్తాయని... ఆ తర్వాత మరిచిపోతున్నారని కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలు డబ్బు చుట్టూ తిరుగుతున్నాయని అన్నారు. ఉపాధి కల్పన లక్ష్యంగా.. మంచి వైద్యం, విద్య కోసం అందరూ సంఘటితం కావాల్సిన అవసరముందని కోదండరాం అభిప్రాయపడ్డారు. ఆస్తులు పెంచుకోవడం కోసం ప్రభుత్వాధికారాన్ని వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెడుతున్నారు. ఫోన్​ ట్యాపింగ్​లు చేస్తున్నారు. ప్రభుత్వం ప్రగతిభవన్​కే సొంతమైనట్లుగా ఉంది. నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటే.. ఒక్క మంత్రి కూడా పట్టించుకోవడం లేదు. ప్రొఫెసర్​ జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా పోరాడతాం. -కోదండ రాం, తెజస అధ్యక్షుడు

అప్పుడే నిజమైన నివాళి

అనేక మంది మేధావులను తెలంగాణ ఉద్యమం వైపు తీసుకువచ్చిన వ్యక్తి జయశంకర్​ అని కోదండరాం పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం మరో పోరాటం చేయాల్సి వస్తుందని జయశంకర్ చెప్పారని గుర్తు చేసుకున్నారు. జయశంకర్ ఆశించిన తెలంగాణ సాధన కోసం తమ తుది శ్వాస వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. ప్రొఫెసర్​ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రం అభివృద్ధి చెందితేనే... ఆయనకు ఘనమైన నివాళి అని కోదండరాం పేర్కొన్నారు.

ఇదీ చదవండి: దళిత బంధుపై అత్యవసర విచారణకు మరోసారి నో చెప్పిన హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.