అనేకమంది అమరవీరుల పోరాటాల ఫలితంగా తెలంగాణ ఏర్పడిందని తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం అన్నారు. హైదరాబాద్ గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి ఆయన నివాళులర్పించారు. రాష్ట్రంలో సీఎం దర్శనభాగ్యం ప్రజలకు కలగడం లేదన్న ఆయన... సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితి నెలకొందన్నారు.
ఉద్యమకాలంలో ఆశించిన తెలంగాణ ఏర్పాటు కావాల్సిన అవసరముందని కోదండరాం ఆకాంక్షించారు. ఎంతో మంది ప్రాణత్యాగాల ఫలితంగా రాష్ట్రం సిద్ధించిందన్న కోదండరాం... ఇవాళ కూడా బతుకుదెరువు కోసం ప్రజలు ఆత్మహత్యకు పాల్పడటం శోచనీయమన్నారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా... పార్టీ కార్యాలయంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు.