రంజాన్ మాసంలో మతసామరస్యం వెల్లువిరుస్తోంది. నగరంలోని పలు రాజకీయ పార్టీలు ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇస్తూ... తమ సోదరభావం చాటుతున్నాయి. తెలంగాణ జన సమితి మైనార్టీ సెల్ విభాగం ఆధ్వర్యంలో నాంపల్లిలోని ఆ పార్టీ కార్యక్రమంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో తెజస అధ్యక్షుడు కోదండరామ్, మాజీ ఎంపీ వివేక్‌తో పాటు పలువురు పార్టీ నేతలు, పాతిక్రేయులు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాష్ట్ర ప్రజలు సరైన గుణపాఠం చెప్పారని కోదండరామ్ అన్నారు. తెలంగాణ అంటే కేసీఆర్ కుటుంబం మాత్రమే కాదని విమర్శించారు.
ఇవీ చూడండి: నాటుకోడి పులుసు,అంబలి@ తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్