ETV Bharat / state

'అమెరికా వెళ్లే అవకాశం పోయిందని ఆందోళన వద్దు' - టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాల వార్తలు

విదేశాలకు చెందిన ఉద్యోగస్తులు, వర్కర్లకు ఇచ్చే వీసాలను రద్దు చేస్తూ అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాల పేర్కొన్నారు. వీసాలపై ఆంక్షల వల్ల ప్రస్తుతం అక్కడ ఉన్న వారికి ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు.

tita-global-president-sandeep-on-trump-restrictions-on-visa
'అమెరికా వెళ్లే అవకాశం పోయిందని ఆందోళన వద్దు'
author img

By

Published : Jun 23, 2020, 8:44 PM IST

అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం భారతీయులను కలవరపాటుకు గురిచేస్తుందని... కానీ సమస్యల్లో నుంచి అవకాశాలు వెతుక్కోవాలని టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాల పేర్కొన్నారు. అమెరికా టెక్నాలజీ కంపెనీలు... ఆ దేశ ఆర్థిక పరిపుష్టిలో భారతీయులుగా ప్రత్యేకంగా తెలుగువారిగా మన టెక్కీల సహాయం ఎంతో ఉందని సందీప్ మక్తాల పేర్కొన్నారు.

''ఐటీ రంగం అనేది ప్ర‌ధానంగా నైపుణ్యంపై ఆధారపడి ఉంటుంది. ఈ వీసాల ఆంక్షాల కార‌ణంగా అమెరికా కంపెనీలు స్థానికులను మాత్ర‌మే నియ‌మించుకోవాలంటే వారికి త‌ప్ప‌కుండా అధిక వేత‌నాలు చెల్లించాల్సి ఉంటుంది. మ‌రోవైపు అక్క‌డి స్థానికులు ఇత‌ర దేశాల‌తో పోటీ ప‌డే నైపుణ్యాలు క‌లిగి లేరనే విష‌యాన్ని కంపెనీలు గుర్తించాయి. ఇలాంటి స‌వాళ్ల నేప‌థ్యంలో ఆంక్ష‌ల అమ‌లు అంత సుల‌భం కాద‌ు. కాబట్టి అక్కడున్న మన టెక్కీలు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఇతర కంపెనీల్లో జీతాలు, ప్ర‌మోష‌న్ల అవ‌కాశాలు వ‌చ్చినా ఆన్‌సైట్ అవ‌కాశం కోసం పని చేస్తున్న‌వారు ఆందోళ‌న చెందే అవ‌కాశం ఉంది. విదేశీ అవ‌కాశం పోయింద‌ని ఆందోళ‌న వ‌ద్ద‌ు.. మ‌న దేశంలోనే ఉన్న అవ‌కాశాల‌ను స‌ద్వినియోగం చేసుకొని కొత్త ఉత్ప‌త్తులు, సేవ‌లు అందించ‌డంపై దృష్టి పెట్టాలి.

-సందీప్ మక్తాల, టీటా గ్లోబల్ ప్రెసిడెంట్

'అమెరికా వెళ్లే అవకాశం పోయిందని ఆందోళన వద్దు'

కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టి మేకిన్ ఇండియా స‌హా తెలంగాణ ప్ర‌భుత్వం క‌ల్పిస్తున్న ద్వితీయ శ్రేణి న‌గ‌రాల్లో ఐటీ కంపెనీల ఏర్పాట్ల ప్ర‌యోజ‌నాలు వంటి అవ‌కాశాల ద్వారా ఈ స‌వాళ్ల‌లో అవ‌కాశం వెతుక్కోవాల‌ని సూచించారు. భార‌తీయులు త‌మ స‌త్తాను చాటుకునేందుకు ఇదే స‌రైన స‌మ‌య‌మ‌ని సందీప్ స్ప‌ష్టం చేశారు.

ఇవీ చూడండి: 'అదనపు బోగీలు సాధ్యం కాదు.. ఈక్యూలో టికెట్లు కేటాయిస్తాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.