ETV Bharat / state

టీ కన్సల్ట్ యాప్​ను ప్రారంభించిన మంత్రి సింగిరెడ్డి - టీ కన్సల్ట్ యాప్​ను ప్రారంభించిన మంత్రి సింగిరెడ్డి

తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) రూపొందించిన టీ. కన్సల్ట్ యాప్​ను వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్నదాతలు వ్యవసాయంలో కొత్త పుంతలు తొక్కేందుకు టీ కన్సల్ట్ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి పేర్కొన్నారు.

tita app for farmers released at hyderabad
టీ కన్సల్ట్ యాప్​ను ప్రారంభించిన మంత్రి సింగిరెడ్డి
author img

By

Published : Jul 18, 2020, 6:06 PM IST

తెలంగాణలోని రైతులు వ్యవసాయంలో కొత్త పుంతలు తొక్కేలా తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) రూపొందించిన టీ. కన్సల్ట్ యాప్​ను వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి ప్రారంభించారు. వ్యవసాయంలోని అన్ని సమస్యలపై సమగ్ర అవగాహన, సమస్యలకు పరిష్కారాలు పొందేందుకు రైతులను శాస్త్రవేత్తలతో అనుసంధానం చేసేలా ఈ యాప్​ సహకరిస్తుందని మంత్రి వెల్లడించారు.

ఇందుకోసం తెలంగాణ వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్తలతో టీటా చర్చలు జరిపింది. తెలంగాణ వ్యవసాయ వర్సిటీ మాజీ రిజిస్ట్రార్ జలపతిరావుతో టీ కన్సల్ట్​ ద్వారా రైతులకు సంబంధించిన సందేహాలను అడిగి తెలుసుకున్నారు. టీ కన్సల్ట్​ యాప్​ ద్వారా రైతులకు మరింత చేరువ కావాలని మంత్రి ఆకాంక్షించారు.

ఇదీ చూడండి : రాష్ట్రంలో 42 వేలు దాటిన కరోనా కేసులు.. 400పైగా మరణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.