ETV Bharat / state

శ్రీవారి దర్శన టోకెన్ల కోసం తోపులాట

తిరుమల శ్రీవారి సర్వదర్శన టోకెన్లు జారీ చేసే తిరుపతి భూదేవి కాంప్లెక్స్‌ వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది. రోజుకు మూడు వేల టికెట్లు జారీ చేస్తుండగా దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరగడంతో తోపులాట చోటుచేసుకొంది. శనివారానికి జారీచేసే టికెట్లు పూర్తవడంతో ఆదివారం దర్శన టోకెన్లను ప్రారంభించారు. సర్వదర్శన టోకెన్ల సంఖ్యను పెంచడంతో పాటు కరోనా నిబంధనలను పాటించేలా చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.

tirumala
శ్రీవారి దర్శన టోకెన్ల కోసం తోపులాట
author img

By

Published : Oct 31, 2020, 11:21 AM IST

శ్రీవారి దర్శనం టోకెన్ల కోసం తిరుపతిలో తోపులాట జరిగింది. తితిదే ప్రతిరోజు మూడు వేల ఉచిత సర్వదర్శన టోకెన్లను జారీ చేస్తోంది. దీని కోసం వివిధ ప్రాంతాల నుంచి భక్తుల పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 31, నవంబరు 1వ తేదీకి సంబంధించిన టోకెన్లను శుక్రవారం రాత్రి 9.45 గంటల నుంచి జారీ చేశారు. ఈ సమయంలో రద్దీ పెరగడంతో పలువురు భక్తులు బారికేడ్లను తోసుకుంటూ ముందుకు వచ్చారు.

పిల్లలు, మహిళలు తోపులాటలో నలిగిపోయారు. బారికేడ్లుగా ఏర్పాటుచేసిన రేకులు తగిలి కొందరికి గాయాలయ్యాయి. తమిళనాడు రాష్ట్రం వేలూరుకు చెందిన భక్తురాలు సుజాత సొమ్మసిల్లి పడిపోగా ఆమెను 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. భూదేవి కాంప్లెక్స్‌ వద్ద చోటుచేసుకున్న పరిస్థితులపై ఈటీవీ భారత్ ప్రతినిధి నారాయణప్ప మరిన్ని వివరాలు అందిస్తారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.