ETV Bharat / state

TTD : శ్రీవారి భక్తులకు శుభవార్త.. రేపటి నుంచి ఆఫ్​లైన్​​లో సర్వదర్శనం టోకెన్లు - ttd Sarva Darshan offline tokens

TTD: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. రేపటి నుంచి ఆఫ్​లైన్​​లో సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్టు తితిదే ప్రకటించింది. ఉదయం 9 గంటలకు టోకెన్లు జారీ చేయనున్నట్టు అధికారులు తెలిపారు.

TTD News
TTD News
author img

By

Published : Feb 14, 2022, 9:40 AM IST

శ్రీవారి భక్తులకు ఎట్టకేలకు శుభవార్త అందింది. ఫిబ్రవరి 15 నుంచి ఆఫ్​లైన్‌లో సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్టు తితిదే ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. కొవిడ్‌ మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఆఫ్​లైన్‌ టికెట్ల జారీ ప్రక్రియను తితిదే నిలిపివేసిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం రాష్ట్రంలో కొవిడ్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో ఆఫ్‌లైన్‌ టికెట్ల జారీ ప్రక్రియను పునరుద్ధరించాలని తితిదే నిర్ణయించింది. 16వ తేదీ సర్వదర్శనం కోసం 15వ తేదీ ఉదయం 9 గంటలకు టోకెన్లు జారీ చేయనున్నట్టు అధికారులు తెలిపారు. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్‌, శ్రీనివాసం కాంప్లెక్స్‌, శ్రీ గోవిందరాజస్వామి సత్రాల్లో ఏర్పాటు చేసే కౌంటర్ల ద్వారా టోకెన్లు జారీ చేయనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.