ETV Bharat / state

Thummala Nageswara Rao To Join Congress : ఖమ్మం రాజకీయాల్లో కీలక మలుపు.. కాంగ్రెస్ గూటికి తుమ్మల.. ఆరోజే చేరిక! - కాంగ్రెస్​లో చేరికపై తుమ్మల క్లారిటీ

Thummala Nageswara Rao To Join Congress : ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్​ఎస్​ కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. కాంగ్రెస్‌ వైపు అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలోకి రావాలని తుమ్మలను రేవంత్ ఆహ్వానించగా.. అభిమానులు, అనుచరగణంతో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. సెప్టెంబర్ 6 లేదా ఆ తర్వాత కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో తుమ్మల హస్తం గూటికి చేరతారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

BRS Leader Thummala Nageswarao
BRS Leader Thummala Nageswarao To Join in Congress
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 1, 2023, 7:16 AM IST

Thummala Nageswara Rao To Join Congress కాంగ్రెస్‌ వైపు సాగుతున్న తుమ్మల రాజకీయ పయనం

Thummala Nageswara Rao To Join Congress : ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో(Khammam Polotics) తన ముద్ర వేసి, రాజకీయ దిగ్గజంగా పేరుగాంచిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తదుపరి రాజకీయ అడుగులు కాంగ్రెస్ వైపేనన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌లోని తుమ్మల నివాసం వేదికగా అనూహ్యంగా సాగిన రాజకీయ పరిణామం ఉమ్మడి రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి తుమ్మలతో ఆయన నివాసంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భేటీ కావడం, ఆయన్ను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించడం వంటి పరిణామాలు చకచకా జరిగిపోయాయి.

Thummala To Join Congress : ఈ సందర్భంగా తుమ్మలను కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి సాదరంగా ఆహ్వానించగా.. ఇందుకు ఆయన సానుకూలంగానే స్పందించినట్లు తెలిసింది. విశ్వసనీయంగా తెలిసిన సమాచారం మేరకు.. గురువారం మధ్యాహ్నం వరకు తుమ్మల(Thummala Joins Congress) ఖమ్మం జిల్లాలోనే ఉన్నారు. ఉదయం పాలేరు నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులతో భేటీ అయ్యారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటల సమయంలో గండుగులపల్లి నుంచి బయలుదేరి ఖమ్మం చేరుకున్నారు. ఇక్కడి నుంచి నేరుగా హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరారు. సాయంత్రం ఆరుగంటల సమయంలో తుమ్మల నివాసానికి చేరుకున్న రేవంత్ రెడ్డి ఆయనతో భేటీ అయ్యారు.

Tummala Nageshwar Rao Met Supporters : మీకోసం పోటీ చేస్తాను.. నిరంతరం ప్రజాక్షేత్రంలోనే ఉండండి.. అనుచరులతో తుమ్మల

Thummala Congress Latest News : నేతల మధ్య సమావేశం సుహుద్భావ వాతావరణంలో సాగడంతో తుమ్మల తదుపరి అడుగులు కాంగ్రెస్ వైపేనన్న ప్రచారం ఊపందుకుంది. తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే వ్యక్తిగా రేవంత్‌ రెడ్డి(Revanth Reddy) అభివర్ణించారు. ఏఐసీసీ జిల్లా ముఖ్య నాయకుల అనుమతితోనే తుమ్మలను కలిసినట్లు వివరించారు. సహచరులను, అభిమానులను సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారన్న రేవంత్‌. కేసీఆర్​ను తరిమికొట్టడానికి అందరం ఏకమవుతున్నామని తెలిపారు. చర్చలు సానూకుల ఫలితానిస్తాయని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి తెలిపారు.

" నేను.. రేవంత్​ రెడ్డి, సుదర్శన్​ ఇంకొంత మంది.. తుమ్మలను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. వారితో చర్చలు జరిపే ముందే కాంగ్రెస్​ నాయకులతో మాట్లాడి ఒక నిర్ణయానికి వచ్చాం. వారు కాంగ్రెస్​లోకి వస్తే ఎలాంటి మార్పులు, లాభాలు ఉంటాయో చర్చించాం. వాళ్ల కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయానికి వస్తామని ఆయన చెప్పారు." - మల్లు రవి, పీసీసీ ఉపాధ్యక్షుడు

తుమ్మల ఇంటికి హరీశ్​ రావు.. రాజకీయ వర్గాల్లో హాట్ ​టాపిక్

తుమ్మల హస్తం గూటికి చేరడం లాంఛనమేనని రాజకీయంగా చర్చ సాగుతోంది. ఈ విషయంపై సెప్టెంబర్ మొదటి వారంలో స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 6 లేదా ఆ తర్వాత కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో తుమ్మల హస్తం గూటికి చేరతారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో సాగుతోంది. 2018 ఎన్నికల్లో బీఆర్​ఎస్​ నుంచి పాలేరు నుంచి పోటీ చేసి ఓటమి పాలైన తుమ్మల.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో(Telangana Assembly Elections 2023) మళ్లీ పాలేరు నుంచి బరిలో దిగాలని భావించారు. 2018 ఎన్నికల్లో పాలేరులో గెలిచిన కందాల ఉపేందర్ రెడ్డి గులాబీ గూటికి చేరారు.

Khammam Politics Latest Updates : అయినప్పటికీ.. పాలేరు టికెట్ తనకే ఇవ్వాలని బీఆర్​ఎస్​ అధిష్టానాన్ని అభ్యర్థించారు. ఆగస్టు 21 న పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన జాబితాలో తుమ్మలకు చోటు దక్కలేదు. దీంతో..తీవ్ర అసంతృప్తికి గురైన తుమ్మల.... ఈ నెల 25న ఖమ్మం జిల్లాలో భారీ బల ప్రదర్శన చేశారు. ఆ ర్యాలీతో బీఆర్​ఎస్​- తుమ్మల మధ్య మరింత దూరం పెరిగింది. ఈ పరిణామాల నడుమ రేవంత్‌రెడ్డి స్వయంగా హైదరాబాద్‌లోని తుమ్మల నివాసానికి వెళ్లడంతో.. రాజకీయ పయనం కాంగ్రెస్ వైపు అనేది ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్‌లో చేరిక తర్వాత వచ్చే ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావు ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న చర్చ మొదలైంది. ఆయన అనుచురులు మాత్రం మళ్లీ పాలేరు నుంచే బరిలోకి దిగుతారని బలంగా చెబుతున్నారు.

Tummala Nageshwara Rao Rally in Khammam : 1000 కార్లు, 2 వేల బైకులతో తుమ్మలకు ఘన స్వాగతం

MP Nama Nageswara Rao meet Tummala : అసంతృప్తులకు బుజ్జగింపులు.. తుమ్మలతో నామ భేటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.