ధనరాజుతో జాగ్రత్త... ఖాళీ ఇల్లు కనిపిస్తే దోచేస్తాడు! వ్యసనాలకు బానిసై వరుస దొంగతనాలకు పాల్పడున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వివరాలను శంషాబాద్ ఏసీపీ అశోక్ కుమారు మీడియాకు వివరించారు. జీడిమెట్ల, సిద్దిపేట, మహబూబ్నగర్ ఏరియాల్లోని పలు ప్రాంతాల్లో చోరీ కేసులు నమోదయ్యాయి. పోలీసులు వేట ప్రారంభించారు. అయినా చిక్కడం లేదు. శంషాబాద్ పీఎస్ పరిధిలో పోలీసులు రెక్కీ నిర్వహిస్తున్నారు. ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. ప్రవర్తన సందేహంగా ఉండడంతో అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించారు. తన పేరు ధనరాజ్ అని, వ్యసనాలకు బానిసై దొంగగా మారానని ఒప్పుకున్నాడు. శంషాబాద్ పీఎస్ పరిధిలోని ఓ ఆలయంలో చోరీ చేసి వస్తున్నట్లు అంగీకరించాడు. నిందితుడి నుంచి ఓ ద్విచక్రవాహనం, బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. రిమాండ్కు తరలించారు. వ్యసనాలకు బానిసైన ధనరాజ్ బాల్యంలోనే జువైనల్ హోంకు వెళ్లివచ్చాడు. ఇప్పటికే మూడుసార్లు జైలు జీవితం గడిపాడు. అయినా అతనిలో మార్పు రాకపోవడంతో పీడీ యాక్టు ప్రయోగించే ఆలోచనలో ఉన్నట్లు ఏసీపీ అశోక్ కుమార్ వివరించారు.
ఇదీ చూడండి : 'మరో సకల జనుల సమ్మెకు సిద్ధమవ్వండి'