అధిక వడ్డీ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. మోసాల్లో కీలకంగా వ్యవహరించిన మరో ఇద్దరు చైనీయులు పరారీలో ఉన్నట్లు సీపీ సజ్జనార్ వెల్లడించారు. దాదాపు 20 వేల మంది బాధితుల నుంచి 50 కోట్ల రూపాయలకుపైగా మోసాలకు పాల్పడినట్లు తెలిపారు. నిందితులకు చెందిన 10 బ్యాంకు ఖాతాలను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. అందులో రూ.3 కోట్లు ఉందన్నారు.
ముందుగా డబ్బు డిపాజిట్ చేస్తే 90 రోజుల వ్యవధిలో 4 రెట్లు అధికంగా తిరిగి చెల్లిస్తామని నమ్మించి మోసం చేశారని సజ్జనార్ తెలిపారు. రుణ యాప్‌లను ప్లే స్టోర్ నుంచి తీసేయడంతో... వాట్సాప్ ద్వారా లింక్‌లు పంపించి దోపిడీ చేస్తున్నట్లు చెప్పారు.
- ఇదీ చూడండి: దా'రుణ' యాప్‌లకు దూరంగా ఉండండి:ఆర్బీఐ