నారాయణగూడ పోలీస్స్టేషన్లో ముగ్గురు కానిస్టేబుళ్లను సీపీ అంజనీకుమార్ సస్పెండ్ చేశారు. విధుల్లో ఉన్న సమయంలో కానిస్టేబుళ్లు మద్యం సేవించారు. వీరు మద్యం తాగుతుండగా ఓ జవాన్ వీడియో తీశారు. కోపంతో ఊగిపోయిన కానిస్టేబుళ్లు నాగరాజు, విశాల్, శివప్రసాద్... జవాన్‌పై దాడిచేశారు.
బాధితుడి ఫిర్యాదుతో సీపీ విచారణకు ఆదేశించారు. దర్యాప్తులో ఆ ముగ్గురు నిబంధనలు అతిక్రమించారని తేలడంతో... ముగ్గురు కానిస్టేబుళ్లను సీపీ సస్పెండ్ చేశారు.
- ఇదీ చూడండి: మల్కాజిగిరిలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య