బాల కార్మికులను ప్రోత్సహించవద్దంటూ ప్రభుత్వాలు ఎంత అవగాహన కల్పిస్తున్నా.. అటు తల్లిదండ్రులు.. ఇటు కొందరు వ్యక్తులు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. పెద్దఎత్తున బాలలను పనిలో చేర్చుకుంటున్నారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 46లోని ఓ ఇంట్లో బాలకార్మికులు ఉన్నారన్న సమాచారంతో పోలీసులు, బాలల సంరక్షణ అధికారులు, చైల్డ్‌లైన్ ప్రతినిధులు తనిఖీలు నిర్వహించారు. ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు బాలికలను అధికారులు గుర్తించారు. వారందరిని పునరావాస కేంద్రాలకు తరలించారు.
బాలికల వయస్సు, ఇతర పత్రాలు నిర్ధరణ అయ్యాక యాజమానులపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
ఇవీ చూడండి: విద్యుత్ తీగలు తగిలి తగలబడ్డ లారీ