హైదరాబాద్ సైదాబాద్‌లోని సాగర్ ప్రధాన రహదారిపై మణికంఠ అనే ఆటో గ్యారేజ్ ఉంది. దీనిలో సల్మాన్ అనే వ్యక్తి గతకొంత కాలంగా పనిచేస్తున్నాడు. అతడు మద్యానికి బానిసై డబ్బులు ఇవ్వాలంటూ తరుచూ యాజమాని దేవ్ సింగ్ నాయక్‌తో గొడవ పడేవాడు.
ఈ నేపథ్యంలో ఇవాళ సాయత్రం నాలుగు గంటల సమయంలో తన సోదరునితో వచ్చి యాజమానిపై తల్వార్లతో బెదిరించటం జరిగింది. భయభ్రాంతులకు గురైన యజమాని బంధువులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.