ETV Bharat / state

త్వరలో బీఆర్​ఎస్​లోకి ఏపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు : సీఎం కేసీఆర్​ - BRS Latest News

Thota Chandrasekhar join to BRS: బీఆర్​ఎస్​లో త్వరలో ఏపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ తెలిపారు. బీఆర్​ఎస్​కు అధికారమిస్తే దేశం మొత్తం దళితబంధు అమలు చేస్తామని.. దేశంలో ఏటా 25 లక్షల మందికి చొప్పున దళితబంధు ఇస్తామని ప్రకటించారు.

kcr
kcr
author img

By

Published : Jan 2, 2023, 10:08 PM IST

Updated : Jan 3, 2023, 6:09 AM IST

త్వరలో బీఆర్​ఎస్​లోకి ఏపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు : సీఎం కేసీఆర్​

Ravella Kishore babu joined BRS: ఆంధ్రప్రదేశ్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం బీఆర్ఎస్లో చేరేందుకు ముందుకొస్తున్నారని గులాబీ దళపతి కేసీఆర్‌ అన్నారు. విశాఖ ఉక్కును కేంద్రం ప్రైవేటీకరిస్తే... బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక మళ్లీ వెనక్కి తీసుకుంటామన్నారు. భారత్‌ రాష్ట్ర సమితి ఏపీ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్‌ను కేసీఆర్ ప్రకటించారు. మాజీ మంత్రి రావెల కిశోర్ బాబును జాతీయస్థాయిలో వినియోగించుకుంటామన్నారు. తమ పీఠాల కిందికి నీళ్లు వస్తాయనుకునే వాళ్లు చాలా అంటారని.. వాటిని పట్టింకోవాల్సిన అవసరం లేదని కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో కేసీఆర్ సమక్షంలో తోట చంద్రశేఖర్‌తోపాటు మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు, విశ్రాంత ఐఆర్‌ఎస్ అధికారి పార్థసారథి, టీజే ప్రకాష్, రమేష్ నాయుడు తదితరులు బీఆర్ఎస్​లో చేరారు.

సంక్రాంతి తర్వాత ఏపీ నుంచి బీఆర్ఎస్​లోకి భారీగా చేరికలు ఉంటాయని కేసీఆర్ తెలిపారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్లో చేరతామంటూ ఫోన్లు చేస్తున్నారని చెప్పారు. ఏపీలో సిసలైన ప్రజా రాజకీయాలు రావాలన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసినా.. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే తిరిగి వెనక్కి తీసుకుంటామని కేసీఆర్ పేర్కొన్నారు. ఎంత ఖర్చయినా మళ్లీ పబ్లిక్ సెక్టార్‌లోకి తీసుకొస్తామననారు. మోదీ ప్రభుత్వానిది ప్రైవేటీకరణ విధానమైతే.. తమది జాతీయీకరణ విధానమన్నారు.

సంక్రాంతి తర్వాత దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకలాపాలు ఊపందుకుంటాయన్నారు. ఏపీతోపాటు మహారాష్ట్ర, పంజాబ్, ఒడిశా, హరియాణ రాష్ట్రాల్లో కమిటీలు సిద్ధమయ్యాయన్నారు. దేశవ్యాప్తంగా 6 లక్షల 49 వేల గ్రామాలు, 4 వేల 3 వందల అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమాంతరంగా బీఆర్ఎస్ విస్తరిస్తుందని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ వంటి పథకాలు కావాలని మహారాష్ట్రతోపాటు పలు రాష్ట్రాల్లో డిమాండ్ ఉందన్నారు.

భారత్‌ రాష్ట్ర సమితి... ఒక రాష్ట్రం, కులం, మతం కోసమో కాదని.. దేశం కోసమని కేసీఆర్ తెలిపారు. బీఆర్ఎస్కు రాజకీయాలు క్రీడ కాదని.. ఒక టాస్క్ అన్నారు. దేశ రాజకీయాల్లో మార్పు కోసం బీఆర్ఎస్కు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తోడుగా ఉండాలని కేసీఆర్ కోరారు. తమ పీఠాల కిందకు నీళ్లు వస్తాయనుకునే వారు ఏదో మాట్లాడుతుంటారని.. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఏపీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.

"రాజకీయాలు అంటే ఒక కార్యాచరణ.. కానీ కొందరు దాన్ని ఆటగా మార్చారు. భారాసకు అధికారమిస్తే రెండేళ్లలో వెలుగుజిలుగుల భారత్‌ను సాకారం చేస్తాం. దేశం మొత్తం రైతులకు ఉచిత విద్యుత్‌ ఇవ్వడం అసాధ్యమేమీ కాదు. రూ.1.45 లక్షల కోట్లతో దేశమంతా రైతులకు ఉచిత విద్యుత్‌ ఇవ్వొచ్చు. భారాసకు అధికారమిస్తే దేశం మొత్తం దళితబంధు అమలు చేస్తాం. దేశంలో ఏటా 25 లక్షల మందికి చొప్పున దళితబంధు ఇస్తాం. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తే నిలిపివేస్తాం. విశాఖ ఉక్కును మోదీ అమ్మితే.. మళ్లీ ప్రభుత్వంలోకి తీసుకుంటాం. మోదీ విధానం ప్రైవేటైజేషన్‌ మాది నేషనలైజేషన్‌. స్వాతంత్య్ర సమరయోధులకు దక్కినంత గౌరవం భారాస నేతలకు దక్కుతుంది. సంక్రాంతి తర్వాత చాలా రాష్ట్రాల్లో భారాస కార్యాచరణ ఉరుకులు పరుగులు పెడుతుంది." - కేసీఆర్, ముఖ్యమంత్రి

ఇవీ చదవండి:

Last Updated : Jan 3, 2023, 6:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.